జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు ఎంపిక

Sep 27 2026 3:46 AM | Updated on Sep 27 2026 3:46 AM

సిరికొండ: జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు సత్యశోధక్‌ పాఠశాలకు చెందిన విద్యార్థి కె అజయ్‌ ఎంపికై న ట్లు ప్రిన్సిపల్‌ ఆర్‌ నర్సయ్య తెలిపారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని తిలక్‌ స్టేడియంలో ఈ నెల 12 నుంచి 14 వరకు జరిగిన రాష్ట్రస్థాయి చాంపియన్‌షిప్‌ పోటీలలో ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. మహారాష్ట్ర ఛత్రపతి సంభాజీనగర్‌లోని డా. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ మరఠ్వాడా యూనివర్సిటీ స్పోర్ట్స్‌ క్యాంపస్‌లో జరగనున్న 39వ సబ్‌ జూనియర్‌ జాతీయ సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌(అండర్‌–15) బాలుర విభాగం పోటీల్లో పాల్గొననున్నట్లు ప్రిన్సిపల్‌ తెలిపారు.

రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు అన్నదమ్ముల ఎంపిక

వర్ని: మండలంలోని చింతల్‌పేట్‌ గ్రామానికి చెందిన అన్నదమ్ములు బి. సురేశ్‌ చౌదరి, మహేశ్‌ చౌదరి రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపికయ్యారు. కామారెడ్డి జిల్లా కొత్తబాదిలో శనివారం నిర్వహించిన ఎంపిక పోటీల్లో సురేశ్‌ చౌదరి అండర్‌–17, మహేశ్‌ చౌదరి అండర్‌–14 విభాగాల్లో ఎంపికయ్యారు. వీరిద్దరూ నిజామాబాద్‌ శివారులోని బోర్గాం హైస్కూల్‌లో చదువుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement