‘సాగర్‌’ నీరు విడుదల | - | Sakshi
Sakshi News home page

‘సాగర్‌’ నీరు విడుదల

Sep 27 2026 3:46 AM | Updated on Sep 27 2026 3:46 AM

‘సాగర్‌’ నీరు విడుదల

నిజాంసాగర్‌(జుక్కల్‌): ఆయకట్టు కింద సాగు చేస్తున్న వానాకాలం పంటల అవసరా ల కోసం శనివారం నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటి విడుదల చేపట్టారు. అలీసాగర్‌ రిజర్వాయర్‌ వరకు సుమారు 1.30 లక్షల ఎకరాల పంటలకు రెండో దఫా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రధాన కాలువకు 1,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నామని, మరో 500 క్యూసెక్కుల వరకు పెంచుతామని అధికారులు తెలిపారు. ప్రధాన కాలువలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉన్నందున రైతులు, పశువుల కాపర్లు కాలువ వైపు వెళ్లవద్దని నీటిపారుదల శాఖ అధికారులు సూచించారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు 17.8 టీఎంసీలకు గాను ప్రస్తుతం 1401.08 అడుగులు 12.566 టీఎంసీల నీరు నిల్వ ఉందని తెలిపారు.

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

● న్యాయ సేవా సంస్థ కార్యదర్శి నీలిమ

నిజామాబాద్‌ లీగల్‌: ప్రభుత్వ పథకాలను దివ్యాంగులు, బధిరులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయసేవా సంస్థ కా ర్యదర్శి నీలిమా సూచించారు. అంతర్జాతీయ బధిరుల దినోత్సవం పురస్కరించుకొని శనివారం న్యాల్‌కల్‌ రోడ్‌లోని బధిరుల పాఠశాల విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వ హించారు. ఈ సందర్భంగా న్యాయసేవా సంస్థ కార్యదర్శి మాట్లాడుతూ మానసిక వికలాంగులను ప్రభుత్వం గుర్తించి వారికి అన్ని వసతులను కల్పించాలన్నారు. ఎవరికై నా సదరం సర్టిఫికెట్‌ ఆలస్యమైతే వెంటనే న్యాయ సేవా సంస్థను సంప్రదించాలని, త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో శోభరాణి, శ్రీనివాసరావు, జ్యోతి, న్యాయసేవా సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

దుబాయ్‌లో ఉద్యోగావకాశాలు

– 28న క్లయింట్‌ ఇంటర్వ్యూలు

వేములవాడ: యూనైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని ఏడీఎన్‌హెచ్‌ సంస్థలో గార్డెనర్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు జీటీఎం ఇంటర్నేషనల్‌ రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీ ప్రతినిధి చీటి సతీష్‌రావు తెలిపారు. గార్డెనర్‌ పోస్ట్‌కు నెలకు 1,200 ఏఈడీ, ఉచిత భోజనం, ఉచిత వీసా, ఉచిత విమాన టికెట్‌, ఉచిత వసతితోపాటు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తారన్నారు. 21 నుంచి 40 ఏళ్ల వారు అర్హులని పేర్కొన్నారు. ఈనెల 28న ఉదయం 11 గంటలకు క్లయింట్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటాను ఈమెయిల్‌ చేయవచ్చు లేదా వాట్సాప్‌ నంబర్‌ 8332016999 కు పంపించాలన్నారు. వివరాలకు నిజామాబాద్‌ 8686860999, ఆర్మూర్‌ 8332015999, జగిత్యాల 8332014999, సిరిసిల్ల 9347661522, సికింద్రాబాద్‌ 8332052299 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.

బీజేపీ మోర్చాల కార్యవర్గాల ఎన్నిక

సుభాష్‌నగర్‌: భారతీయ జనతా పార్టీ కిసాన్‌, ఎస్సీ, ఎస్టీ మోర్చాల జిల్లాస్థాయి పూర్తి కార్యవర్గాన్ని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్‌ పటేల్‌ కులాచారి ఆదేశాల మేరకు ఆయా మోర్చాల జిల్లా అధ్యక్షులు పాట్కూరి తిరుపతిరెడ్డి, పురుషోత్తం, ఓం సింగ్‌ నాయక్‌ శనివారం వేర్వేరుగా ప్రకటించారు. ఎస్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శులుగా రాథోడ్‌ సుందర్‌సింగ్‌ (నిజామాబాద్‌ అర్బన్‌), కె పీర్‌సింగ్‌ (ఆర్మూర్‌)తో పాటు జిల్లా ఉపాధ్యక్షులుగా నలుగురితో పాటు కార్యవర్గాన్ని నియమించారు.ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శులుగా జి నాగభూషణం (బోధన్‌), పి యుగేంధర్‌ (ఆర్మూర్‌), కార్యదర్శులుగా బి సృజన్‌ (ఆర్మూర్‌), జి శ్రీనివాస్‌(నిజామాబాద్‌ అర్బన్‌),అఖిలేష్‌కుమార్‌ (నిజామాబాద్‌ రూరల్‌), రాహుల్‌, జి శంకర్‌ (నిజామాబాద్‌ అర్బన్‌), తోపాటు జిల్లా ఉపాధ్యక్షులుగా ఐదుగురితోపాటు కార్యవర్గాన్ని నియమించారు. కిసాన్‌ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శులుగా అంతిరెడ్డి హరీష్‌రెడ్డి (నిజామాబాద్‌ అర్బన్‌), ముస్కు నర్సయ్య (బాల్కొండ) తోపాటు నలుగురు ఉపాధ్యక్షులను, కార్యవర్గ సభ్యులను నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement