కనులపండువగా జెండా ఉత్సవం | - | Sakshi
Sakshi News home page

కనులపండువగా జెండా ఉత్సవం

Sep 27 2026 3:46 AM | Updated on Sep 27 2026 3:46 AM

● భక్తులతో కిటకిటలాడిన ఆలయం

నిజామాబాద్‌ రూరల్‌: జిల్లా కేంద్రంలోని జెండా బాలాజీ మందిరంలో జాతర కనులపండువగా సా గింది. ఉత్సవాల్లో భాగంగా శనివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి జెండాను దర్శించుకుని పూజలు నిర్వహించారు. అలాగే పీసీసీ చీఫ్‌ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్‌ వేడుకల్లో పాల్గొని, జెండాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ సీనియర్‌ నాయకులు యెండల లక్ష్మీనారాయణ, అర్బన్‌ ఎ మ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ పాల్గొని జెండాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోవింద నామస్మరణల మధ్య జెండా ఊరేగింపు భక్తిశ్రద్ధలతో కొనసాగింది. స్వామివార్లకు అర్చకు లు అజయ్‌ సాంగ్‌ వాయి, సంజయ్‌ సాంగ్‌ వాయి, విజయ్‌ సాంగ్‌వాయి వారు ప్రత్యేక పూజలు చేశా రు. జెండాను సిర్నాపల్లి గడి మీద నుంచి పూలాంగ్‌ వరకు శోభాయాత్ర నిర్వహించారు. ఊరేగింపులో భక్తులు కోలాటాలు, భజనలతో ఆకట్టుకున్నారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి శివరాత్రి ఆంజనేయులు, మాజీ చైర్మన్లు లవంగ ప్రమోద్‌, జాలిగం, గోపాల్‌ కుమార్‌, పోలకొండ నర్సింగ్‌ రావు, అసి స్టెంట్‌ ప్రశాంత్‌కుమార్‌, ఆలయ అర్చకులు వెలుగలేటి నాగరాజు చారి, ఆలయ సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement