సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

Sep 24 2026 2:30 AM | Updated on Sep 24 2026 2:30 AM

కమ్మర్‌పల్లి(భీమ్‌గల్‌): బీడీ కార్మికుల సంక్షేమం కో సం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ను అర్హులైన కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్‌ కేంద్ర కార్మిక సంక్షేమ శాఖ డిప్యూటీ వెల్ఫేర్‌ కమిషనర్‌ సాగర్‌ ప్రధాన్‌ పేర్కొన్నారు. బీడీ కార్మికులు, వారి పిల్లలకు కేంద్ర ప్ర భుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, విద్యా సదుపాయాలు, స్కాలర్‌షిప్‌లపై భీమ్‌గల్‌ మండలం బాబాపూర్‌లోని చార్‌భాయ్‌ బీడీ కంపెనీలో బుధవారం అవగాహన కల్పించారు. బీడీ కార్మికుల పిల్లలకు అందించే విద్యా స్కాలర్‌షిప్‌లకు సంబంధించి కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని రూ.2.52 లక్షలకు పెంచినట్లు వివరించారు. అర్హులైన విద్యార్థులు నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌ (సీఎస్‌సీ) ద్వా రా ఆన్‌న్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు సమయంలో అవసరమైన ధ్రువపత్రాలు, వివరాలను సక్రమంగా సమర్పించాలని అధికారులు సూచించారు. డాక్టర్‌ శ్రీకాంత్‌, సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌, ఎం. గంగాధర్‌, సీనియర్‌ ఫార్మసీ ఆఫీసర్‌, చార్‌భాయ్‌ బీడీ కంపెనీ మేనేజర్‌ లక్ష్మణ్‌ బీడీ కార్మికులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement