రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

Sep 24 2026 2:30 AM | Updated on Sep 24 2026 2:30 AM

మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

రామారెడ్డి: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్ర శివారులో ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో దంపతులిద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. రామారెడ్డి మండలం మద్దికుంటకు చెందిన దుంపల రాజయ్య (45), బాలమణి(40) దంపతులు బుధవారం సాయంత్రం కామారెడ్డినుంచి స్వగ్రామానికి బైక్‌పై వెళ్తున్నారు. రామారెడ్డి శివారులోని సబ్‌స్టేషన్‌ సమీపంలో ఎదురుగా వస్తున్న బైక్‌ వీరిని ఢీకొట్టింది. ఆ బైక్‌పై నలుగురు వ్యక్తులున్నారు. ఈ ప్రమాదంలో రాజయ్య, బాలమణితోపా టు మరోబైక్‌పై ఉన్న రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన రాఘవేంద్ర, నరేందర్‌ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని కామారెడ్డి ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ రాజయ్య, బాలమణి మృతిచెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement