బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి స్థలం అప్పగింత | - | Sakshi
Sakshi News home page

బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి స్థలం అప్పగింత

Jul 25 2026 12:47 AM | Updated on Jul 25 2026 12:47 AM

నవీపేట: మండల కేంద్రంలో దశాబ్దకాలంగా పెండింగ్‌లో ఉన్న బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి ఎట్టకేలకు శుక్రవారం మోక్షం లభించింది. నవీపేటలోని కమలాపూర్‌ క్రాసింగ్‌ నుంచి నవీపేట శివారులోని బాసర రహదారికి అనుసంధానిస్తూ బైపాస్‌ రోడ్డుకు గతంలో ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రతిపాదనలు చేశారు. కానీ పరిధిలోని స్థలంలో రైతులు పంటలు సాగు చేస్తూ భూములను అప్పగించేందుకు ససేమిరా అన్నారు. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి చొరవతో రెవెన్యూ అధికారులు మళ్లీ రైతులను సంప్రదించి భూసేకరణకు నడుం బిగించారు. నిర్మాణానికి అనువైన ఎకరం 38గుంటలనర సాగుభూమిని రోడ్డు నిర్మాణానికి ఇచ్చేందుకు రైతులు ఒప్పుకున్నారు. దీంతో రైతుల నుంచి తీసుకున్న భూమి ప్రతులను తహసీల్దార్‌ వెంకటరమణ శుక్రవారం రైతులు, ప్రజాప్రతినిధులు, నాయకుల సమక్షంలో ఆర్‌అండ్‌బీ బోధన్‌ డీఈఈ రామ్మోహన్‌రావుకు అప్పగించారు. త్వరలో పనులను ప్రారంభిస్తామని డీఈఈ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement