వైద్య విధాన పరిషత్‌కు కమిషనర్‌ను నియమించాలి | - | Sakshi
Sakshi News home page

వైద్య విధాన పరిషత్‌కు కమిషనర్‌ను నియమించాలి

Jul 25 2026 12:47 AM | Updated on Jul 25 2026 12:47 AM

ఆర్మూర్‌టౌన్‌: వైద్య విధాన పరిషత్‌ శాఖ కమిషనర్‌ పదవీ విరమణ చేసిన స్థానంలో నూతన కమిషనర్‌ను నియమించాలని ఆర్మూర్‌ ఏరియా సూపరింటెండెంట్‌ ప్రమీదరెడ్డి అన్నారు. వైద్య విధాన పరిషత్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ పిలుపు మేరకు ఏరియా ఆస్పత్రిలో మొక్కలు నాటుదాం.. మనవి చేద్దాం అంటూ వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు, వైద్యవిధానపరిషత్‌లో సమస్యల పరిష్కారానికి కమిషనర్‌ నియామకం అవసరమన్నారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో వైద్యులు, సిబ్బంది మొక్కలు నాటారు. వైద్యులు అమృత్‌రాంరెడ్డి, అమరేశ్వర్‌, అజయ్‌, మోహన్‌రెడ్డి, కృష్ణవేణి, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement