మోపాల్: మోపాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోరీకి గురైన, పోగొట్టుకున్న ఆరు సెల్‌ఫోన్లను ఎస్సై సుస్మిత బాధితులకు శుక్రవారం అప్పగించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు సీఈఐఆర్ పోర్టల్, ఇతర సాంకేతిక ఆధారాల సాయంతో సెల్‌ఫోన్ల ఆచూకీ తెలుసుకుని స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ పోయిన వెంటనే సమీప పీఎస్‌లో, సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయాలని ఎస్సై తెలిపారు. సెల్‌ఫోన్లను సమర్థవంతంగా ట్రేస్ చేసి గుర్తించడంలో కానిస్టేబుల్ జ్యోతి విశేష కృషి చేసినందుకు ఆమెను ఎస్సై అభినందించారు.
ఆర్మూర్‌లో..
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా సేకరించి బాధితులకు శుక్రవారం అందజేసినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. మొత్తం 5 ఫోన్లను బాధితులకు అందించినట్లు ఎస్‌హెచ్‌వో పేర్కొన్నారు.


