చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి

Jul 25 2026 12:47 AM | Updated on Jul 25 2026 12:47 AM

చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి

జక్రాన్‌పల్లి: చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు జక్రాన్‌పల్లి ఎస్సై మహేశ్‌ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పడకల్‌ గ్రామంలోని హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌ సమీపంలో ఈ నెల 20న గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు పక్కన పడి ఉండగా పెట్రోల్‌ బంక్‌ సిబ్బంది గమనించి 108 అంబులెన్స్‌ ద్వారా చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా శుక్రవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి వయస్సు సుమారు 50 ఏళ్ల వరకు ఉంటుందని అన్నారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement