ప్రజా ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజా ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి

Jul 25 2026 12:47 AM | Updated on Jul 25 2026 12:47 AM

ప్రజా ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి దరఖాస్తుల ఆహ్వానం 27న ఇంటర్‌ స్పాట్‌ అడ్మిషన్స్‌

వేల్పూర్‌: పోలీస్‌స్టేషన్‌కు ప్రజల నుంచి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులకు సత్వర పరిష్కారం అందించాలనే లక్ష్యంతో పోలీసులు పని చేయాలని ఆర్మూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. బాల్కొండ పోలీస్‌స్టేషన్‌ను ఆర్మూర్‌ ఏసీపీ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీఎస్‌ పరిధిలో శాంతి భద్రతలు, పెండింగ్‌ కేసుల దర్యాప్తు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరును పరిశీలించారు. స్టేషన్‌లో రిసెప్షన్‌, లాకప్‌గది, సీసీ కెమెరాలు, విజిటర్‌ రిజిస్టర్‌, పెండింగ్‌ పిటిషన్ల వివరాలను ఎస్సై శైలేందర్‌ను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు, సిబ్బంది ఉన్నారు.

రెంజల్‌: జవహార్‌ నవోదయలో ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఎంఈవో ఆంజనేయులు సూచించారు. 2027–28 విద్యా సంవత్సరానికి గాను నవోదయలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ విడుదలైందన్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఆరో తరగతి ప్రవేశం కోసం ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. గ్రామీణ విద్యార్థులకు 70 శాతం, ఇతరులకు 30 శాతం సీట్లు ఉంటాయన్నారు. ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రవేశ పరీక్ష నవంబర్‌ 28న ఉంటుందన్నారు. మండల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అతిథి అధ్యాపక పోస్టుకు..

ఆర్మూర్‌టౌన్‌: ఆర్మూర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హెల్త్‌కేర్‌ సబ్జెక్టు బోధించేందుకు అతిథి అధ్యాపక పోస్టు భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ వేణుగోపాల్‌స్వామి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ హెల్త్‌కెర్‌, ఎమ్మెస్సీ మైక్రోబయోలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిసీ్ట్రలో 55శాతం అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఈనెల 27 వరకు దరఖాస్తు చేసుకోవాలని, 28న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూకు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరు కావాలని కోరారు.

జక్రాన్‌పల్లి: మండలంలోని మునిపల్లి గ్రామంలో ఉన్న మహాత్మా జ్యోతీబా ఫూలే బీసీ గురుకుల బాలికల కళాశాలలో ఈ నెల 27న ఇంటర్‌ స్పాట్‌ అడ్మిషన్స్‌ ఉంటాయని ప్రిన్సిపాల్‌ అనూష శుక్రవారం తెలిపారు. ఆర్మూర్‌, బాల్కొండ, సాలూరా (సీవోఈ) కళాశాలలో వివిధ గ్రూపులైన ఎంపీసీ, బైపీసీ కోర్సులలో మిగిలిన సీట్ల భర్తీ కోసం స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థినులు మునిపల్లి కళాశాలలో తల్లిదండ్రులతో హాజరు కావాలన్నారు. పదో తరగతిలో 480కి పైగా మార్కులు వచ్చిన వారు అర్హులని తెలిపారు. పదో తరగతి మెమో, ఒరిజినల్‌ టీసీ, బోనాఫైడ్‌, కుల, ఆదాయ ధ్రువపత్రాలు, ఆధార్‌ కార్డు, ఐదు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు, మూడు సెట్ల జిరాక్స్‌ కాపీలతో హాజరు కావాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement