బోధన్: రాబోయే ఏడాది జూలై నెలలో నిర్వహించే గోదావరి నది పుష్కర పనుల పురోగతిపై శుక్రవారం పట్టణ కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ భుజంగరావు పలు శాఖల అధికారులతో సమావేశమై సమీక్షించారు. పుష్కరాలకు సంబంధించి ఆయా శాఖల పరిధిలోని పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. కందకుర్తి త్రివేణి సంగమ క్షేత్రంలో ఆలయాల అభివృద్ధి పనులను త్వరిగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాల ఏర్పాట్లు, నది నీటి కలుషితం కాకుండా తీసుకోవాల్సిన జా గ్రత్త చర్యలు, పారిశుద్ధ్యం నిర్వహణ అంశాల పై అధికారులతో చర్చించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ఆర్డీవో విజయకుమారి, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, ఎండోమెంట్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
భిక్కనూరు: మండలంలోని కాచాపూర్ గ్రామంలో బెల్ట్‌షాపులు నిర్వహించొద్దని గ్రామసభలో ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానించారు. సర్పంచ్ జ్యోతి సంతోష్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన సభలో గ్రామంలో బెల్ట్‌షాపులతో కలిగే ఇబ్బందులపై ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో బెల్ట్‌షాపులను నిర్వహించొద్దని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఉపసర్పంచ్ బైండ్ల దశరథం, వార్డు సభ్యులు పాల్గొన్నారు.


