కారును ఢీకొన్న ఆటో.. ఇద్దరికి గాయాలు
మాక్లూర్: రాంగ్ రూట్‌లో వచ్చిన ప్యాసింజర్ ఆటో ఎదురుగా వస్తున్న కారును ఢీకొనడంతో ఆటోలో ఉన్న ఇద్దరికి గాయాలైనట్లు మాక్లూర్ ఎస్సై అనిల్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం భీంగల్‌కు చెందిన షేక్ అహ్మద్ అతని స్నేహితుడు రఫిక్ కలిసి కారులో నిజామాబాద్ నుంచి మధ్యప్రదేశ్‌కు వెళ్తుండగా ఆర్మూర్ నుంచి నిజామాబాద్ వస్తున్న ప్యాసింజర్ ఆటో చిన్నాపూర్ గండి వద్ద రాంగ్ రూట్‌లో వచ్చి కారును ఢీకొన్నది. ఆటోలో ఉన్న ఇద్దరు ప్రయాణికులకు గాయాలు కాగా 108లో ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. కారు నడుపుతున్న అహ్మద్ ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్ అర్పాత్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
కుక్క దాడిలో చిన్నారికి..
వర్ని: మోస్రా మండలం గోవురు గ్రామంలో ఏడాది వయస్సు గల చిన్నారిపై కుక్క శుక్రవారం దాడి చేసి గాయపరిచింది. గ్రామానికి చెందిన సంగెపొల్ల రమేశ్ కుమార్తె ఇంటి ఎదుట ఆడుకుంటుండగా వీధి కుక్క దాడి చేసి గాయపరిచినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన చిన్నారిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో కుక్కల బెడద తీవ్రంగా ఉందని అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
రెండు బైక్‌లు ఢీ.. ఇద్దరికి..
తాడ్వాయి: మండలంలోని కరడ్‌పల్లి శివారులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలైనట్లు గ్రామస్తులు, పోలీసులు తెలిపారు. కరడ్‌పల్లికి చెందిన కుర్మరాజు తన బైక్‌పై జనగాం వైపు వెళ్తుండగా.. గాంధారి మండలం గుజ్జల తండాకు చెందిన సావేరం తన బైక్‌పై కరడ్‌పల్లి వైపు వస్తుండగా రెండుబైక్‌లు ఢీకొన్నాయి. ప్రమాదంలో రెండు బైక్‌లపై ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


