రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

Feb 23 2026 7:14 AM | Updated on Feb 23 2026 7:14 AM

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

కమ్మర్‌పల్లి:మండల శివారులో ని కేసీఆర్‌ కాలనీ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌ను కారు ఢీకొన్న ఘటనలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందారు. ఎస్సై అనిల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కేసీఆర్‌ కాలనీకి చెందిన ఎర్రోళ్ల లస్మయ్య(75) అనే వృద్ధుడు తన టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌ వాహనంపై పని నిమిత్తం గ్రామంలోకి వెళ్లి తిరిగి వస్తుండగా కాలనీ సమీపంలోని జాతీయ రహదారిపై మోర్తాడ్‌ వైపు నుంచి వేగంగా వస్తున్న కారు ఢీకొన్నది. దీంతో లస్మయ్య రోడ్డుపై పడిపోవడంతో తలకు, రెండు కాళ్లకు, దవడ భాగం, ఎడమ కన్ను భాగంలో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుమార్తె వసంత ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement