శిక్షణ ఇచ్చేవారేరి..?
మోర్తాడ్(బాల్కొండ): మోర్తాడ్ మండలంలో ఎని మిది ఉన్నత పాఠశాలలు ఉండగా ఒక్కరు మాత్ర మే ఫిజికల్ డైరెక్టర్ ఉన్నారు. మిగిలిన పాఠశాలల్లో వ్యాయమ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇది ఒక్క మోర్తాడ్ మండలంలోని ఉన్నత పాఠశాలల పరిస్థితి కాదు. జిల్లాలోని చాలా ఉన్నత పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉండటంతో విద్యార్థులకు క్రీడా పోటీల్లో శిక్షణ ఇచ్చేవారు కరువయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా సీఎం కప్ పేరిట గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ అంశాల్లో క్రీడా పోటీలను నిర్వహిస్తోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో విద్యార్థులు రాణించాలనే లక్ష్యంతో సీఎం కప్ పోటీలను ప్రతి ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. అయితే వ్యాయామ ఉపాధ్యాయుల నియామకాన్ని మాత్రం పట్టించుకోకపోవడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రాథమికోన్నత స్థా యి నుంచి ఉన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్ అయిన పాఠశాలలకు వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేయకపోవడం మరో నిర్లక్ష్యం. ప్రతి ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులు తప్పనిసరి అనే నిబంధన ఉన్నా పట్టించుకున్న దా ఖలాలు లేవు. ఉన్నత పాఠశాల స్థాయికి చేరుకున్న విద్యార్థులకు ఆయా క్రీడాంశాల్లో సరైన పట్టులేక క్రీడలకు దూరమవుతున్నారు. ఇప్పటికై నా ప్రభు త్వం స్పందించి వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
జిల్లాలో పరిస్థితి ఇది..
జిల్లాలో 255 ఉన్నత పాఠశాలలు ఉండగా.. కేవలం 115 మంది వ్యాయామ ఉపాధ్యాయు లు ఉన్నారు. 107 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. 33 పాఠశాలలకు వ్యాయామ ఉపాధ్యా య పోస్టులను మంజూరు చేయలేదు. అలాగే 132 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలలకు పీఈటీ పోస్టులను అసలే మంజూరు చేయలేదు. ఎంతో మంది ఫిజికల్ ఎడ్యుకేషన్ డిగ్రీని పూర్తి చేసి ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇస్తారనే ఆశతో నిరీక్షిస్తున్నారు.
క్రీడాకారులను ప్రోత్సహించాలి
ప్రభుత్వం పాఠశాల స్థాయి లోనే విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇవ్వాలి. క్రీడాకారుల ను ప్రోత్సహిస్తేనే వారు రా ణించే అవకాాశం ఉంది. ఎంతో మంది క్రీడాకారులు ఉన్నా వారిలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించేవారు లేక పోవడంతో తీవ్ర నష్టం జరుగుతోంది.
– కానూరి సంజీవ్, బాక్సింగ్ శిక్షకుడు, మోతె
పాఠశాలల్లో వ్యాయామ
ఉపాధ్యాయుల కొరత
జిల్లాలో 255 ఉన్నత పాఠశాలలు..
115 మంది పీఈటీలు
క్రీడలకు దూరమవుతున్న విద్యార్థులు
శిక్షణ ఇచ్చేవారేరి..?


