ఎత్తితే లేవవు..దించితే దిగవు
నిజాంసాగర్(జుక్కల్): నిజాంసాగర్ ప్రాజెక్టు ప్ర ధాన కాలువ వరద గేట్లకు నిర్వహణ లేక నిర్లక్ష్యాని కి గురవుతున్నాయి. చివరి ఆయకట్టు వరకు సాగు నీరందించే ప్రధాన కాలువ గేట్లు తుప్పు పట్టి మొ రాయిస్తున్నాయి. దీంతో ‘సాగర్’ జలాలు వృథా అవుతున్నాయి. ప్రధాన కాలువకు నీటి విడుదల చేపట్టిన ప్రతీసారి వరద గేట్లను కిందకు దించడం నీటి పారుదల శాఖ సిబ్బంది కష్టతరమవుతోంది.
ప్రాజెక్టుకు తొమ్మిది వరద గేట్లు..
నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటి విడుదల కోసం అప్పట్లో 9 వరద గేట్లను ఏ ర్పాటు చేశారు. ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్న జల విద్యుదుత్పత్తి కేంద్రానికి నాలుగు గేట్లు, మిగి తా 5 గేట్లు నీటి పారుదలశాఖ ఆధీనంలో ఉన్నా యి. అయితే, ఆయకట్టు కింద పంటల సాగు అవసరాలకు ప్రధాన కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ఈ కాలువకు నీటిని విడుదల చేస్తున్న ప్రతీసారి గేట్లు ఎత్తడం, నిలిపివేత సమయంలో కిందకు దించుతారు. ఈ నేపథ్యంలో ప్రతీసారి గేట్లు మొరాయిస్తున్నాయి. 365 రోజులపాటు గేట్లు నీటిలో ఉండటంతో తుప్పు పడుతున్నాయి.
నిర్లక్ష్యం నీడన ‘సాగర్’ గేట్లు
మొరాయిస్తూ మూలనపడ్డ
మూడు గేట్లు
మిగిలిన రెండు గేట్ల
పనితీరు అంతంతే
నీటి విడుదల సమయంలో
తప్పని గేట్ల కష్టాలు


