సమగ్ర సమాచారం.. | - | Sakshi
Sakshi News home page

సమగ్ర సమాచారం..

Feb 23 2026 7:14 AM | Updated on Feb 23 2026 7:14 AM

సమగ్ర సమాచారం..

సమగ్ర సమాచారం..

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): మహిళా సంఘాలు మరింత సులభంగా సీ్త్రనిధి రుణాలు పొందేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ‘మన సీ్త్రనిధి’ యాప్‌ను రూపొందించింది. అర్హత ఉంటే చాలు ఆన్‌లైన్‌లోనే రుణాలు పొందే అవకాశాన్ని కల్పించింది. అధికారులు ఎస్‌హెచ్‌జీ సభ్యురాలి ఇంటి వద్దకు రాకున్నా స్వయంగా వారే మొబైల్‌ యాప్‌ ద్వారా రూ.50వేల రుణం పొందొచ్చు. తిరిగి చెల్లించిన రుణ వాయిదాలను సైతం యాప్‌లోనే చూసుకోవచ్చు. ఇటీవల అందుబాటులోకి వచ్చిన యాప్‌ను మహిళా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకునేలా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌హెచ్‌జీ మహిళలు వ్యాపారాలు, ఇతర పనులు చేసుకునేందుకు సీ్త్రనిధి రుణాలు మంజూరు చేస్తూ ఆర్థిక చేయూతనిస్తోంది. ఇది వరకు సీ్త్రనిధి రుణాలు పొందాలంటే అధికారులు ఇంటికి వచ్చి ట్యాబ్‌లో వివరాలు, సభ్యురాలి ఫొటో, వేలి ముద్రలు, వ్యాపారానికి సంబంధించిన ఫొటో వివరాలను తీసుకునే వారు. ఎన్ని వేల రుణం తీసుకున్నా ఇదే పద్ధతి కావడంతో బ్యాంకు ఖాతాలో డబ్బులు జమయ్యే సరికి నాలుగైదు రోజులు పట్టేది. ఇప్పుడు అలా కాకుండా రూ.50వేల వరకు రుణాన్ని యాప్‌ ద్వారా నేరుగా సభ్యురాలు పొందవచ్చు. ‘మన సీ్త్రనిధి’ యాప్‌లో రుణం కోసం దరఖాస్తు చేసుకోగానే వీవోఏకు సమాచారం వెళ్తుంది. 24 గంటల వ్యవధిలో వీఏవో అప్రూవల్‌ చేస్తారు.

అప్రూవల్‌ చేయకుంటే దరఖాస్తు ఆటోమెటిక్‌గా ఏపీఎం లాగిన్‌ కు వెళ్తుంది. ఏపీఎం పరిశీలించి అసిస్టెంట్‌ మేనేజర్‌కు అక్కడి నుంచి రీజినల్‌ మేనేజర్‌కు పంపుతారు. అక్కడ ఆమోదం లభించగానే రుణం మొత్తం నేరుగా సభ్యురాలి ఖాతాలో జమవుతుంది. ఈ విధానంతో ఎస్‌హెచ్‌జీ సంఘాల సభ్యులు వీవోఏ, సీసీల చుట్టూ తిరిగే పని తప్పుతుంది. జిల్లాలో కొంత మేర అమల్లోకి వచ్చిన ఈ యాప్‌ను పూర్తి స్థాయిలో అమలు చేసేలా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.

సద్వినియోగం చేసుకోవాలి..

స్వయం సహాయక సంఘా లు ‘మన సీ్త్రనిధి’ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి. యాప్‌లో బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. సభ్యులకు ప్రయోజనం చేకూరడంతోపాటు అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది. యాప్‌పై మహిళా సంఘాలకు, సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నాం.

– రామ్‌దాస్‌, సీ్త్రనిధి రీజినల్‌ మేనేజర్‌, నిజామాబాద్‌

రుణాల పంపిణీ, చెల్లింపు విషయంలో జరుగుతున్న మోసాలు, వైఫల్యాలను అరికట్టేందుకు ఈ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఇక మీదట రుణ మంజూరుతోపాటు రుణాలు పొందిన మహిళలు నేరుగా యాప్‌ ద్వారానే కిస్తీలు చెల్లించుకునే అవకాశం ఉంది. దీంతోపాటు తాము చెల్లించిన సొమ్ము రుణ ఖాతాలో జమయ్యిందో లేదో అని సరిచూసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా ఎంత చెల్లించాల్సి ఉందనే సమగ్ర సమాచారం యాప్‌లో ఉంటుంది. ఇకపై రుణాల కిస్తీలు చెల్లించేందుకు బ్యాంకుల వద్ద పడిగాపులు కాయాల్సిన అవసరం ఉండదు. ఫోన్‌పే ద్వారా కూడా సీ్త్రనిధి వాయిదాల చెల్లింపునకు అవకాశం ఉంది.

‘మన సీ్త్రనిధి’ యాప్‌ను

అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం

మొబైల్‌ ద్వారానే సులభంగా రుణాలు పొందొచ్చు.. వాయిదాలు చెల్లించొచ్చు

ఎస్‌హెచ్‌జీ మహిళలకు అవగాహన

కల్పిస్తున్న అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement