జాతీయ స్థాయి మారథాన్‌లో రెండోస్థానం
ఖలీల్‌వాడి: జాతీయ స్థాయి మారథాన్ పో టీల్లో జిల్లాలోని గిరి రాజ్ కళాశాలకు చెందిన ఎన్‌సీసీ క్యాడెట్ శ్రీకాంత్ రెండో స్థానంలో నిలిచారు. అస్సాంలోని కొక్రాఝర్‌లో నిర్వహిస్తున్న జాతీయ ఐక్య, సాంస్కృతిక మార్పిడి, క్రమశిక్షణ ప్రత్యేక శిబిరానికి దేశంలోని 17 ఎన్‌సీసీ డైరెక్టరేట్ల నుంచి ఎంపిక చేసిన క్యాడెట్లు పాల్గొన్నారు. కార్యక్రమంలో 10 కి.మీల మారథాన్ నిర్వహించగా గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల క్యాడెట్లు శ్రీకాంత్, అమర్‌సింగ్, జ్యోతి పాల్గొన్నారు. క్యాడె ట్ శ్రీకాంత్ రెండోస్థానంలో నిలిచినట్లు ఎన్‌సీసీ అధికారి, లెఫ్టినెంట్ డాక్టర్ రామస్వామి తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. రంగరత్నం, అధ్యాపకులు అభినందించారు.
ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా రఘురాం నాయక్
ఖలీల్‌వాడి: ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా జిల్లాకు చెందిన బా నోత్ రఘురాం నాయ క్ ఎన్నికయ్యారు. అలాగే జిల్లా నుంచి సుభోద్, అనూష, కార్తీక్ సభ్యులుగా అవకాశం దక్కింది. ఈనెల 18 నుంచి 20 వరకు జిల్లా కేంద్రంలోని గోనెరెడ్డి కల్యాణ మండపంలో నిర్వహించిన ఫెరేషన్ రాష్ట్ర నాల్గో మహాసభల్లో నూతన కౌన్సిల్‌ను ఎన్నుకున్నారు. విద్యారంగ సమస్యలపై ఎఐఎస్‌ఎఫ్ నిరంతరం పోరాటాలు చేస్తుందని రాష్ట్ర సహాయ కార్యదర్శి రఘురాంనాయక్ అన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
ఖలీల్‌వాడి: జిల్లాలో 2026–27 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్‌లో నూతన పాఠశాలల నమోదు కోసం జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు సోషల్ వెల్ఫేర్ జిల్లా అధికారి రాజగంగారాం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల పాఠశాలలు కలెక్టరేట్‌లోని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కార్యాలయంలో మార్చి 25 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు సమర్పించాలని పేర్కొన్నారు. నిర్ణీత కాల వ్యవధి తర్వాత అందిన దరఖాస్తులు స్వీకరించబడవని తెలిపారు.
డీసీసీల శిక్షణ శిబిరంలో రామకృష్ణ
నిజామాబాద్ రూరల్: వికారాబాద్ జిల్లాలో కొ నసాగుతున్న తెలంగా ణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా ల డీసీసీ అధ్యక్షుల శిక్షణా శిబిరంలో ఆదివారం నగర అధ్యక్షుడు రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఇప్పటి వ రకు చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు. అలాగే కార్పొరేషన్ పీఠంపై విజయా న్ని, భవిష్యత్తులో చేపట్టే ప్రణాళికల గురించి ప్రస్తావించారు. తన రాజకీయ అనుభవాన్ని శిబిరంలో అందరితో పంచుకున్నారు.
బోధన్‌రూరల్: బోధన్ పట్టణ కేంద్రంలోని ఇంటర్ పరీక్షల స్ట్రాంగ్ రూంను డీఐఈవో టీ రవి కుమార్ ఆదివారం తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూంలో ప్రశ్నాపత్రాలు భద్రపరిచిన గదిని పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే కంట్రోల్ రూంను సంప్రందించాలని సూచించారు. ఆయన వెంట అధికారులు, సిబ్బంది ఉన్నారు.
జాతీయ స్థాయి మారథాన్‌లో రెండోస్థానం
జాతీయ స్థాయి మారథాన్‌లో రెండోస్థానం


