సాంగ్లీ మార్కెట్‌ మెచ్చేలా.. | - | Sakshi
Sakshi News home page

సాంగ్లీ మార్కెట్‌ మెచ్చేలా..

Feb 23 2026 7:14 AM | Updated on Feb 23 2026 7:14 AM

సాంగ్

సాంగ్లీ మార్కెట్‌ మెచ్చేలా..

కల్లాల్లో తీవ్రంగా శ్రమిస్తున్న

డొంకేశ్వర్‌ రైతులు

నాణ్యమైన పసుపును సిద్ధం చేస్తున్న

కర్షకులు

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): పసుపు సాగు చేయడం.. పంట దిగుబడిని విక్రయించడం వరకు రైతుల శ్రమ అంతాఇంతా కాదు. దిగుబడి వచ్చే వరు ఓ భయం.. వచ్చి న దిగుబడిని విక్రయించే వరకు మరో భయం వా రిని వెంటాడుతూనే ఉంటుంది. అయితే మే లైన పసుపును మార్కెట్‌కు తీసుకెళ్తేనే మంచి ధర వస్తుందనే ఆశతో రైతులు కల్లాలో తీవ్రంగా శ్రమిస్తున్నారు. అందులో సాంగ్లీ మార్కెట్‌ మెచ్చేలా ఎక్కువ ధర పొందడానికి డొంకేశ్వర్‌ మండలంలోని రైతులు రెండింతలు ఎక్కువ కష్టపడుతున్నారు. ఆర్మూర్‌ నియోజకవర్గంలో పసుపును అత్యధికంగా సాగు చేస్తున్న ప్రాంతాల్లో డొంకేశ్వర్‌ మండలం ఒకటి. ఈ ఏడాది 1,250 ఎకరాల్లో పసుపు పంట వేశారు. ఎకరానికి 8 నుంచి 10 ట్రాక్టర్ల వరకు దిగుబడి వచ్చింది. ప్రస్తుతం కల్లాల్లో పసుపును ఉడకబెట్టి ఆరబోస్తున్నారు. వారం రోజులపాటు ఎండిన పసుపు కొమ్మును డ్రమ్ముల్లో వేసి డబుల్‌ పాలిష్‌ చేస్తున్నారు. పాలిష్‌ చేసిన దానిలో నాణ్యమైన కొ మ్మును వేరు చేస్తున్నారు. మూడు రకాల కొమ్ము లను తీసి సంచుల్లో నింపుతున్నారు. మండలంలో దాదాపు 80శాతం మంది రైతులు నాణ్యమైన పసుపును సిద్ధం చేసి మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్‌కు తీసుకెళ్తున్నారు. అక్కడ విక్రయిస్తే నిజామాబాద్‌ మార్కెట్‌ కన్నా క్వింటాల్‌కు రూ.2 వేలు అదనంగా లభిస్తోందని రైతులు చెబుతున్నా రు. ప్రస్తుతం సాంగ్లీలో రూ.16వేల నుంచి రూ.17 వేల వరకు ధర లభిస్తోంది.

డొంకేశ్వర్‌లో పసుపును

ఉడకబెడుతున్న దృశ్యం

ప్రతిసారి సాంగ్లీకే..

రెండెకరాల్లో పసుపు సాగు చే శాను. ఆశించిన దిగుబడి వ చ్చింది. కొమ్ము బాగా ఎండిన తర్వాత పాలిష్‌ చేసి సంచుల్లో నింపుతాం. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా సాంగ్లీ మార్కెట్‌లో విక్రయిస్తా. నిజామాబాద్‌ కన్నా సాంగ్లీలో క్వింటాల్‌కు రూ.2వేలు అదనంగా వస్తాయి. – గంగుల బాపురావు, రైతు, డొంకేశ్వర్‌

శ్రమిస్తేనే మంచి ధర వస్తుంది

ఈ ఏడాది నాలుగు ఎకరాల్లో పంట వేశాను. నాణ్యమైన కొమ్ము కావాలంటే అన్ని వి ధాలుగా ఎండలో తీవ్రంగా శ్రమించాలి. కొమ్ము మెత్తగా లేకుండా చూసుకొని పాలిష్‌ చేయాలి. మేలురకం పసుపు పంటకు సాంగ్లీ మార్కెట్‌లో మంచి ధర లభిస్తుంది.

– రాహుల్‌ రెడ్డి, యువరైతు, డొంకేశ్వర్‌

సాంగ్లీ మార్కెట్‌ మెచ్చేలా.. 1
1/3

సాంగ్లీ మార్కెట్‌ మెచ్చేలా..

సాంగ్లీ మార్కెట్‌ మెచ్చేలా.. 2
2/3

సాంగ్లీ మార్కెట్‌ మెచ్చేలా..

సాంగ్లీ మార్కెట్‌ మెచ్చేలా.. 3
3/3

సాంగ్లీ మార్కెట్‌ మెచ్చేలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement