ప్రశాంతంగా టీజీ సెట్
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం జోన్–2 పరిధిలోని నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి గురుకుల ప్రవేశ పరీక్ష టీజీ సెట్ – 2026 ప్రశాంతంగా కొనసాగినట్లు జోనల్ ఆఫీసర్ యుగంధర లక్ష్మి తెలిపారు. జోన్ –2 పరిధిలో ఏర్పాటు చేసిన 70 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 25,345 మంది విద్యార్థులకు గాను 24,076 మంది పరీక్షకు హాజరైనట్లు ఆమె తెలిపారు. అలాగే నిజామాబాద్ జిల్లాలో ప్రవేశ పరీక్షకు మొత్తం 8,901 మంది విద్యార్థులకు గాను 8,414 మంది హాజరయ్యారన్నారు.


