నిజామాబాద్‌ | - | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌

Feb 22 2026 7:04 AM | Updated on Feb 22 2026 7:04 AM

నిజామ

నిజామాబాద్‌

న్యూస్‌రీల్‌

వదంతులను నమ్మొద్దు

ఆదివారం శ్రీ 22 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

నిజామాబాద్‌అర్బన్‌: సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యే వదంతులను నమ్మొద్దని, ప్రతి ఒక్కరూ శాంతియుత వాతావరణంలో పండుగలు నిర్వహించుకోవాలని పోలీస్‌ కమిషనర్‌ సాయి చైతన్య అన్నారు. జిల్లా కేంద్రంలోని కమిషనరేట్‌ కార్యాలయంలో శనివారం శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించగా, ఆర్మూర్‌, బోధన్‌, నిజామాబాద్‌ డివిజన్‌ పరిధిలోని ఆయా మతాల పెద్దలు హాజరయ్యారు. సీపీ మాట్లాడుతూ.. సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లో సంప్రదించాలని లేదా డయల్‌ 100కు సమాచారం అందించాలని సూచించారు. అన్ని మతాల వారు సోదరభావంతో మెలగాలన్నారు. మసీదుల వద్ద ప్రార్థన సమయంలో తగిన భద్రత, ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు చేపడతామన్నారు. సమావేశంలో అదనపు డీసీపీ బస్వారెడ్డి ,నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌, ట్రాఫిక్‌ ఏసీపీలు ప్రకాశ్‌, శ్రీనివాస్‌, వెంకట్‌రెడ్డి, మస్తాన్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

నిజామాబాద్‌1
1/1

నిజామాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement