విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలి

Feb 22 2026 7:04 AM | Updated on Feb 22 2026 7:04 AM

విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలి

విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలి

ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ

ఉపాధ్యక్షుడు స్టాలిన్‌

ముగిసిన రాష్ట్ర నాల్గో మహాసభలు

ఖలీల్‌వాడి: ఫెడరల్‌ స్ఫూర్తికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం 2020, వికసిత్‌ భా రత్‌ శిక్షా అధిష్టాన్‌ (వీబీఎస్‌ఏ)–2025 బిల్లు లో పాల పుట్ట అని ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ ఉపాధ్యక్షుడు స్టాలిన్‌ విమర్శించారు. విద్యాకాషాయీకరణ, కేంద్రీకరణ, కార్పొరేటీకరణ, వ్యాపారీకరణ చేస్తూ వి ద్యారంగాన్ని అంత్యంత ప్రమాదంలోకి నెడుతున్నా రని ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హా ల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్‌తో కలిసి మాట్లాడారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఏఐఎస్‌ఎఫ్‌ సమరశీల ఉద్యమాలు నిర్వహిస్తుందన్నారు. కేంద్ర బడ్జెట్‌ విద్యార్థి వ్యతిరేక బడ్జెట్‌ అని, వచ్చే రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. విద్యా వ్యాపారీకరణతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ మైనారిటీలకు సామా జిక న్యాయం దూరమయ్యేలా ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులున్నా కేంద్రం నుంచి తీసుకువచ్చిందేమీ లేద ని మండిపడ్డారు. ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర 4వ మహాసభలు విజయవంతంగా ముగిశాయని తెలిపారు. సమావేశంలో ఉపాధ్యక్షులుగా రెహమాన్‌, గ్యార క్రాంతి, సోతుకు ప్రవీణ్‌, బాలసాని లెనిన్‌, సహాయ కార్యదర్శులుగా ఇటికాల రామకృష్ణ, బానోతు రఘురాం, సుబోద్‌ గ్యార నరేశ్‌, చిట్యాల రాజు, కోశాధికారిగా కాసోజు నాగజ్యోతి ఎన్నికయ్యారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement