టైమ్ బాగోలేదు!
ఇందూరు నగరానికి ప్రతీకగా చెప్పుకునే గంజ్‌లోని క్లాక్ టవర్ టైమ్ బాగోలేనట్టుంది. ఎన్నో ఏళ్లుగా పని చేయని గడియారాల స్థానంలో కొత్త గడియారాలను మార్కెట్ కమిటీ ఏర్పాటు చేయించింది. నాలుగు గడియారాల ఏర్పాటుకు రూ.4.50 లక్షలు వెచ్చించగా, మరో రూ.2.50 లక్షలను టవర్ మరమ్మతులకు ఖర్చు చేశారు. ఏర్పాటు చేసిన ఐదు నెలలకే గడియారాలు పని చేయడం లేదు. మార్కెట్ పాలకవర్గం, అధికారులు స్పందించి గడియారాలకు మరమ్మతులు చేయించాలని నగరవాసులు, వ్యాపారులు కోరుతున్నారు.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్
టైమ్ బాగోలేదు!


