డీసీసీ అధ్యక్షుల శిక్షణలో నగేశ్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

డీసీసీ అధ్యక్షుల శిక్షణలో నగేశ్‌రెడ్డి

Feb 22 2026 7:04 AM | Updated on Feb 22 2026 7:04 AM

డీసీస

డీసీసీ అధ్యక్షుల శిక్షణలో నగేశ్‌రెడ్డి

సుభాష్‌నగర్‌: రాష్ట్రంలోని ఆయా జిల్లాల కాంగ్రెస్‌ అధ్యక్షులకు వికారాబాద్‌ జిల్లాలో 10 రోజులపాటు నిర్వహిస్తున్న శిక్షణ శిబిరా నికి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కాట్‌పల్లి నగేశ్‌రెడ్డి, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ హాజరయ్యారు. శిక్షణ శనివారం ప్రా రంభమైంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని జి ల్లాల కాంగ్రెస్‌ అధ్యక్షులకు పదిరోజులపా టు శిక్షణ కొనసాగనుందన్నారు. మొదటిరోజు సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారని, ముగింపు కార్యక్రమానికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలిపారు.

ప్రణాళికాబద్ధంగా చదవాలి

నందిపేట్‌(ఆర్మూర్‌): ప్రతి విద్యార్థి ప్రణాళికాబద్ధంగా, పట్టుదలతో చదివి పదిలో మంచి ఫలితాలు సాధించాలని జిల్లా సాధారణ పరీక్ష బోర్డు(డీసీఈబీ) కార్యదర్శి సీతయ్య సూచించారు. నందిపేట మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం పదో తరగతి విద్యార్థులకు పరీక్షలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీతయ్య మాట్లాడుతూ విద్యార్థుల పట్టుదల, ఉపాధ్యాయుల ప్రోత్సాహం, త ల్లిదండ్రుల సహకారం తోడైతే గమ్యాన్ని ఇట్టే చేరుకోవచ్చని ఉద్బోధించారు. ఒత్తిడిని అధిగమిస్తేనే ఏకాగ్రత దరి చేరుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈవో అవధూ త గంగాధర్‌, హెచ్‌ఎం మంజుల, రాజేశ్వర్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

తెలుగు ఉపాధ్యాయుడికి సత్కారం

బోధన్‌: పంపా సాహితీ పీఠం అధ్యక్షుడు, తెలుగు ఉపాధ్యాయుడు పురాణే అజయ్‌కుమార్‌ రాష్ట్రస్థాయి సత్కారం అందుకున్నారు. శనివారం హైదరాబాద్‌లో అక్షరయాన్‌ తెలుగు ఉమెన్స్‌ రైటర్‌ ఫౌండేషన్‌, అభిజ్ఞ భారత్‌ ఆర్గనైజేషన్‌, సీతా చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు భాషా పరిరక్షణకు కృషి పురాణే అజయ్‌కుమార్‌ను మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌, డాక్టర్‌ మామిడి హరికృష్ణ, అయినంపూడి శ్రీలక్ష్మి సన్మానించారు.

రెండు వారాల్లో 134 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు

నిజామాబాద్‌అర్బన్‌: కమిషనరేట్‌ పరిధిలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు కొనసాగుతున్నాయని, గత రెండు వారాల్లో 134 కేసులు న మోదయ్యాయని సీపీ సాయిచైతన్య తెలిపా రు. రెండు వారాల్లో 134 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసు నమోదయ్యాయి. పట్టుబడిన వారిని కోర్టులో హాజరు పర్చగా రూ.12.10 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. 13 మందికి న్యాయస్థానం వారం రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.

రేపు యథావిధిగా పోలీస్‌ ప్రజావాణి

నిజామాబాద్‌అర్బన్‌: జిల్లా కేంద్రంలోని పో లీస్‌ కమిషనరేట్‌లో ప్రజావాణిని సోమవా రం యథావిధిగా నిర్వహించనున్నట్లు సీపీ సాయిచైతన్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను విన్నవించేందుకు రావాలని సూచించారు.

డీసీసీ అధ్యక్షుల  శిక్షణలో నగేశ్‌రెడ్డి 1
1/2

డీసీసీ అధ్యక్షుల శిక్షణలో నగేశ్‌రెడ్డి

డీసీసీ అధ్యక్షుల  శిక్షణలో నగేశ్‌రెడ్డి 2
2/2

డీసీసీ అధ్యక్షుల శిక్షణలో నగేశ్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement