సమయం.. పరిమితమే! | - | Sakshi
Sakshi News home page

సమయం.. పరిమితమే!

Jan 29 2026 6:07 AM | Updated on Jan 29 2026 6:07 AM

సమయం.

సమయం.. పరిమితమే!

న్యూస్‌రీల్‌

నిజామాబాద్‌

పైసలే ప్రామాణికం

మున్సిపల్‌ ఎన్నికల్లో ఆర్థికంగా ఉన్నవారినే అభ్యర్థులుగా ఎంపిక చేసేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు మొగ్గుచూపుతున్నాయి.

గురువారం శ్రీ 29 శ్రీ జనవరి శ్రీ 2026

– 8లో u

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్‌ ప్ర క్రియ రాజకీయ పార్టీలను, ఆశావహులను టెన్షన్‌ పట్టిస్తోంది. నామినేషన్ల ఘట్టం నుంచి పోలింగ్‌ క్రతువు వరకు యుద్ధప్రాతిపదికన చేస్తున్న తీరుతో ప్రత్యేక వాతావరణం నెలకొంది. నామినేషన్ల దాఖ లుకు మూడురోజులు సమయం ఇవ్వడం, అది కూడా తక్షణమే కావడంతో చూస్తుండగానే మొదటి రోజు పూర్తయ్యింది. నామినేషన్ల దాఖలుకు ఇంకా రెండు రోజుల సమయమే ఉంది. దీంతో జిల్లాలోని నిజామాబాద్‌ నగరపాలకం, బోధన్‌, ఆర్మూర్‌, భీంగల్‌ పురపాలకాల్లో టికెట్ల కేటాయింపు కోసం ప్రధాన పార్టీలు హడావుడి పడుతున్నాయి. కీలక నాయకులతోపాటు ద్వితీయ, త్రుతీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. మరోవైపు టికెట్ల ఆశావహులు నానా హైరానా పడుతున్నారు. అయితే ఎన్నికల ఖర్చు మాత్రం తగ్గుతుందని ఆశావహులు ఒకింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక టికెట్లు ఆశించి భంగపడిన ఆశావహులు రెబెల్స్‌గా బరిలోకి దిగకుండా బుజ్జగించేందుకు పార్టీల నాయకులు హడావుడిగా సిద్ధమవుతున్నారు. రిజర్వేషన్ల రొటేషన్‌ నేపథ్యంలో అంతా కొత్తకొత్తగా ఉందని ఆశావహులు, కార్యకర్తలు చెబుతున్నారు. రిజర్వేషన్లలో కొందరికి పట్టున్న డివిజన్లు మారడం, సమయం అత్యంత పరిమితంగా ఉండటంతో పరేషాన్‌ అవుతున్నారు. ఇక టికెట్ల విషయానికి వస్తే సర్వేలే ప్రామాణికమని పార్టీలు చెబుతుండడంతో కొందరు ఆశావహులు పార్టీలు మారేందుకు సైతం సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఇతర పార్టీలతో టచ్‌లోకి వెళ్లిన ఆశావహుల సంఖ్య బాగానే ఉంది.

నిజామాబాద్‌లో భారీగా దరఖాస్తులు..

నిజామాబాద్‌ నగరపాలక సంస్థ పరిధిలో ప్రధాన పార్టీల నుంచి కార్పొరేటర్‌ టికెట్ల కోసం భారీగా పోటీ నెలకొంది. 60 డివిజన్లు ఉన్న ఈ నగరంలో అత్యధికంగా కాంగ్రెస్‌ పార్టీ టికెట్ల కోసం 710 దరఖాస్తులు వచ్చాయి. 45 డివిజన్లకు పోటీ చేయనున్న బీజేపీ నుంచి టికెట్ల కోసం 650 పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇక నిజామాబాద్‌లో కింగ్‌మేకర్‌గా నిలిచే అవకాశాలు ఉన్న ఎంఐఎం పార్టీకి టికెట్ల కోసం 20 డివిజన్ల నుంచి ఏకంగా 412 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. బీఆర్‌ఎస్‌ తన ప్రాబల్యం నిలబెట్టుకునేందుకు పట్టు ఉన్న డివిజన్లలో గట్టిగా ఫైట్‌ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. నగరంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ, ఎంఐఎం నుంచి టికెట్లు ఆశిస్తున్నవారి సంఖ్య ఒక్కో డివిజన్‌లో 10 నుంచి 15 మంది వరకు ఉండడం గమనార్హం. దీంతో పార్టీల నాయకులు అభ్యర్థుల ఎంపికలో పరేషాన్‌ అవుతున్నారు. సావధానంగా ఆలోచించే సమయం లేకపోవడంతోపాటు అసలు విశ్లేషించుకోకపోతే ఎలా అనే మీమాంసలో కీలక నాయకులు తర్జనభర్జన పడుతున్నారు. కాగా నగర మేయర్‌ పీఠం విషయంలో ప్రధాన పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. ఎవరిని ఎంపిక చేసుకోవాలి.. ఏ డివిజన్‌ అయితే సేఫ్‌గా ఉంటుందనే లెక్కలు వేసుకుంటున్నారు. బీజేపీలో మేయర్‌ అభ్యర్థి విషయానికి వస్తే అనేక విశ్లేషణలు చేసుకుంటున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ నుంచి మేయర్‌ రేసులో డీసీసీ మాజీ అధ్యక్షుడు, రాష్ట్ర కోఆపరేటివ్‌ యూనియన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ మానా ల మోహన్‌రెడ్డి కోడలు మానాల సవిత రుషేందర్‌రెడ్డి ఉన్నారు. అదేవిధంగా ప్రముఖ వ్యాపారి వంశీ నరేందర్‌రెడ్డి సతీమణి సైతం రేసులో ఉ న్నారు. వీరిద్దరూ 19వ డివిజన్‌ నుంచి నామినేషన్లు దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే వేగంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో మరికొన్ని గంటల్లో రాజకీయం అనేక మలుపులు తిరుగనుంది. ఎంఐఎం మాత్రం కింగ్‌ మేకర్‌గా ఉంటాననే ధీమాలో ఉంది.

మున్సిపల్‌ పోరు అన్ని దశల ప్రక్రియకు కేవలం 12 రోజులే..

ఆశావహులతోపాటు ప్రధాన పార్టీల్లోనూ గందరగోళం

టికెట్ల కేటాయింపులు, నామినేషన్లు, బుజ్జగింపుల విషయంలో హడావుడి

నిజామాబాద్‌ మేయర్‌ పీఠం పై ఉత్కంఠ

సమయం.. పరిమితమే!1
1/1

సమయం.. పరిమితమే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement