సందడిగా ఎన్‌ఎంసీ
● నో డ్యూ సర్టిఫికెట్ కోసం బారులు
సుభాష్‌నగర్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ కార్పొరేషన్ కార్యాలయం అభ్యర్థులు, ప్రతిపాదకులతో బుధవారం సందడిగా మారింది. నామినేషన్ల ప్రక్రియ మొదలుకావడంతో అభ్యర్థులు, వారికి ప్రతిపాదనలు పెట్టే వారు నో డ్యూ సర్టిఫికెట్‌ను నామినేషన్ పత్రంతో జతపర్చాల్సి ఉంటుంది. అదేవిధంగా అభ్యర్థులు, ప్రతిపాదకులు మున్సిపాలిటీకి ఎలాంటి బాకీ ఉండొద్దు. ఈ క్రమంలో ఆస్తి పన్ను చెల్లించిన వా రు.. నో డ్యూ సర్టిఫికెట్ కోసం మున్సిపల్ కార్యాలయంలోని రెవెన్యూ విభాగానికి క్యూ కట్టారు. ఉదయం నుంచి రాత్రి వరకు సర్టిఫికెట్ల కోసం పడిగాపులు కాశారు. రికార్డులు పరిశీలించిన త ర్వాత వారికి అధికారులు సర్టిఫికెట్లు జారీచేశా రు. ఒక్కరోజే సుమారు 500 మందికిపైగా సర్టి ఫికెట్లు ఇచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు.


