మొదట మున్సిపాల్టీయే..!
సర్పంచులు
ఆర్మూర్: అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధి, సంస్కృతి, సంప్రదాయాల ఆచరణలో ఆర్మూర్ పట్టణానికి జిల్లాలో ప్రత్యేక స్థానం ఉంది. వ్యవసాయంతోపాటు వ్యాపారం ఇక్కడ అభివృద్ధి పథంలో ఉండటంతో జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. ఆర్మూర్ పట్టణంలో మున్నూరుకాపు, క్షత్రి య సమాజ్ (ఖత్రి, పట్కరి) కు లస్తులు అధికంగా ఉంటారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మ తాల సమ్మేళనంతో లౌకికవాదానికి ప్రతిరూపంగా నిలుస్తోంది.
ల్యాండ్ మార్క్ సిద్దులగుట్ట..
ప్రకృతి రమణీయతకు అద్దం పట్టేలా ఒకదానిపై ఒకటి పేర్చినట్లుగా నల్ల్లని రాళ్లతో విస్తరించి ఆర్మూర్ పట్టణ నడిబొడ్డున ఉన్న నవనాథుల సిద్దులగుట్ట చారిత్రాత్మక ప్రాశస్త్యాన్ని సంతరించుకుంటోంది.
నవనథులు గోరఖ్‌నాథ్, జలంధర్‌నాథ్, చరఫట్‌నాథ్, అపభంగనాథ్, కానీషనాథ్, మచ్చీంద్రనాథ్, చౌరంగీనాథ్, రేవనాథ్, బర్తరినాథ్ గుట్టపైన ఉన్న ఒక ఇరుకైన గుహలో ఇష్టదైవమైన సిద్దేశ్వరున్ని ప్రతిష్టించి పూజలు చేశారని ప్రతీతి. ఈ నవనాథుల పేరునే నవనాథపురంగా నామకరణ చేయబడింది. కాలక్రమంలో తొమ్మిది మంది స్వాములలో ఆరుగురు ఇక్కడి నుంచి వెళ్లిపోగా ముగ్గురు ఇక్కడే ఉండి పూజలు చేయడంతో ఆరు.. మూరు.. అంటూ కాలక్రమంలో ఆర్మూర్‌గా పేరును స్థిరపర్చుకుంది.
నాల్గో ఎన్నిక..
ఆర్మూర్ మున్సిపాలిటీ చరిత్రలో నాలుగో పాలకవర్గం కోసం ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించనున్నారు. 64 ఏళ్ల క్రితం మున్సిపాలిటీగా ఉన్న ఆర్మూర్‌ను పరిపాలనా సౌలభ్యం కోసం గ్రామ పంచాయతీగా మార్చారు. 1956 నుంచి 1962 వరకు ఆర్మూర్ మున్సిపల్ మొట్టమొదటి చైర్మన్‌గా కేవీ నరసింహారెడ్డి బాధ్యతలు నిర్వహించారు.
సుమారు 44 సంవత్సరాలు గ్రామ పంచాయతీగా కొనసాగిన అనంతరం తిరిగి 2006 మే 26న నాటకీయ పరిణామాల మధ్య మున్సిపాలిటీగా మార్చారు. చిట్టచివరి సర్పంచ్‌గా కొంగి సదాశివ్ బాధ్యతలు నిర్వహించారు.
52 సంవత్సరాల తర్వాత 2008 జూన్‌లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు. అనంతరం 2014, 2020 సంవత్సరాలలో మున్సిపల్ ఎన్నికలు కొనసాగాయి. తాజాగా 2026లో నాలుగో పర్యాయం ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. 2019లో ఆర్మూర్ పట్టణానికి సమీపంలోని పెర్కిట్–కొటార్మూర్, మామిడిపల్లి గ్రామాలను విలీనం చేయడంతో వార్డుల సంఖ్య 23 నుంచి 36కి పెరిగింది. ఆర్మూర్ గ్రామ పంచాయతీని 2006లో మున్సిపాలిటీగా మార్చినా కోర్టు కేసుల కారణంగా ఎన్నికలు నిర్వహించేందుకు రెండు సంవత్సరాల కాలం పట్టడం విశేషం.
కేవీ నరసింహారెడ్డి
కంచెట్టి గంగాధర్
త్రివేణి గంగాధర్
కశ్యప్ స్వాతిసింగ్
వన్నెల్‌దేవి లావణ్య
పండిత్ వినిత
మున్సిపల్ చైర్మన్లు
పంచాయతీ పాలనలో 44 ఏళ్లు..
తిరిగి మున్సిపాల్టీగా మార్పు
మొట్టమొదటి చైర్మన్ కేవీ నరసింహారెడ్డి
ఆర్మూర్‌కు ప్రాతినిధ్యం వహించిన
ఐదుగురు సర్పంచ్‌లు..
ఆరుగురు చైర్మన్‌లు
వ్యవసాయం, వ్యాపార రంగాల్లో
ప్రత్యేక గుర్తింపు
మున్సిపల్ నాలుగో పాలకవర్గం కోసం వేడెక్కిన రాజకీయం
మొదట మున్సిపాల్టీయే..!
మొదట మున్సిపాల్టీయే..!
మొదట మున్సిపాల్టీయే..!


