తొలిరోజు 22 నామినేషన్లు
సుభాష్‌నగర్: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ బుధవారం ప్రా రంభమైంది. జిల్లాలోని నిజామాబాద్ నగర పా లక సంస్థతోపాటు భీమ్‌గల్, ఆర్మూర్, బోధన్ మున్సిపాలిటీల్లో తొలిరోజు 22 మంది నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ నుంచి ఎనిమిది, కాంగ్రెస్ నుంచి తొమ్మిది, బీఆర్‌ఎస్ నుంచి ము గ్గురు, ఇతరులు ఇద్దరు నామపత్రాలు సమర్పి ంచారు. ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లకు గడువు ఉంది. గురు, శుక్రవారాల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. అందుకోసం నామినేషన్ స్వీకరణ కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్లు తెలిపారు.
తక్కువ సంఖ్యలో..
నామినేషన్ల మొదటిరోజులో భాగంగా నిజామాబాద్ నగరపాలక సంస్థలో 12 డివిజన్ల నుంచి మాత్రమే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 13 మంది నామాపత్రాలు సమర్పించారు. నగరంలోని 1, 13, 40, 55 డివిజన్లలో కాంగ్రెస్, 3, 5, 18, 34, 36, 45, 47 డివిజన్లలో బీజేపీ, 36, 37 డివిజన్లలో బీఆర్‌ఎస్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఒక్క 36వ డివిజన్‌లోనే బీజేపీ, బీఆర్‌ఎస్ అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. మిగతా చోట్ల ఒకటి చొప్పున దాఖలయ్యాయి. ఆర్మూర్ మున్సిపాలిటీలో ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. 3, 9 వార్డుల్లో కాంగ్రెస్, 33వ వార్డు లో బీజేపీ, 3 వార్డులో బీఆర్‌ఎస్, 2 వార్డులో స్వతంత్ర అభ్యర్థి నామపత్రాలు సమర్పించారు. భీమ్‌గల్ మున్సిపాలిటీలో నాలుగు నామినేషన్‌లు దాఖలయ్యాయి. 8, 9, 10 వార్డులో కాంగ్రెస్, 9 వార్డులో బీఎస్పీ అభ్యర్థులు నామినేషన్ పత్రాలు అందజేశారు.
బీఫావ్‌ు దక్కకపోతే
స్వతంత్రంగా పోటీ!
మున్సిపల్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీ లతోపాటు స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచేందు కు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పార్టీ బీఫావ్‌ు దక్కని పక్షంలో స్వతంత్రంగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎం, ఆప్, సీపీఎం, బీ ఎస్‌పీ, టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీతోపాటు ఇతర గుర్తింపు పొందిన పార్టీల నుంచి అభ్యర్థులు పోటీ చేసే అవకాశముంది. భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశమున్న నేపథ్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
నిజామాబాద్‌లో 13, ఆర్మూర్‌లో ఐదు, భీమ్‌గల్‌లో నాలుగు దాఖలు
బోధన్‌లో నామినేషన్లు నిల్
కాంగ్రెస్–9, బీజేపీ–8, బీఆర్‌ఎస్– 3, ఇతరులు– 2
నేడు, రేపు భారీగా నామపత్రాల దాఖలుకు అవకాశం
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు


