సమన్వయంతో ముందుకు | - | Sakshi
Sakshi News home page

సమన్వయంతో ముందుకు

Jan 27 2026 9:26 AM | Updated on Jan 27 2026 9:26 AM

సమన్వ

సమన్వయంతో ముందుకు

న్యూస్‌రీల్‌

నిజామాబాద్‌

భక్తి శ్రద్ధలతో చక్రతీర్థం

రథోత్సవంలో భాగంగా జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వరాలయంలో భక్తిశ్రద్ధలతో

చక్రతీర్థం నిర్వహించారు.

మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026

– 8లో u

మంత్రి కోమటిరెడ్డిని

కలిసిన ఎంపీ అర్వింద్‌

సుభాష్‌నగర్‌: ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఎంపీ అర్వింద్‌ ధర్మపురి సోమవారం కలిశారు. 15 నెలలుగా పెండింగ్‌లో ఉన్న మాధవనగర్‌ ఆర్‌వోబీ 193 సవరించిన అదనపు కేటాయింపులు రూ.8.68 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేయాలని మంత్రికి విన్నవించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి తక్షణమే మంజూరు ఉత్తర్వులను జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రికి ఎంపీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

నిధులు మంజూరు చేయండి

కమ్మర్‌పల్లి: బాల్కొండ నియోజకవర్గంలోని చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకం మరమ్మతులకు నిధులు మంజూరు చేయాల ని కమ్మర్‌పల్లికి చెందిన రైతులు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి విన్నవించారు. కాంగ్రెస్‌ ఇన్‌చార్జి ము త్యాల సునీల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ సుంకె ట బుచ్చ న్న, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు ర వి, కమ్మ ర్‌పల్లి చెందిన పలువురు రైతులు మంత్రి ఉత్తమ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

నమ్మక ద్రోహులకు

గుణపాఠం తప్పదు

కమ్మర్‌పల్లి(భీమ్‌గల్‌): నమ్మి పదవులు ఇస్తే అనుభవించి, ఇప్పుడు కన్నతల్లి వంటి పార్టీ కి ద్రోహం చేసిన వారికి ప్రజలే గుణపాఠం చెబుతారని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. భీమ్‌గల్‌ పట్టణానికి చెందిన వేముల భాస్కర్‌తోపాటు సుమారు 100 మంది యువకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరగా, ఆయన వారికి గు లాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. వే ల్పూర్‌లోని తన నివాసంలో ఏర్పాటు కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొందరు స్వలాభం కోసం పార్టీని వీడి, తన గుండె మీద తన్ని వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశా రు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత భీమ్‌గల్‌లో అభివృద్ధి పూర్తిగా స్తంభించిందని, తామ ప్రభుత్వం పేదల కోసం మంజూరు చే సిన వంద పడకల ఆస్పత్రి పనులను కాంగ్రె స్‌ ప్రభుత్వం ఆపేసిందని మండిపడ్డారు. పాత పనులకే మళ్లీ శంకుస్థాపనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌

ఇలా త్రిపాఠి

మహిళా సంఘాలకు రుణాలు

భరతమాత వేషధారణలో విస్డమ్‌ విద్యార్థిని.. దేశభక్తి గీతంపై నృత్య ప్రదర్శన ఇస్తున్న విజయ్‌ హైస్కూల్‌ విద్యార్థులు

జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్దాం

ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలోనే

నంబర్‌ వన్‌

రైతులకు సరిపడా యూరియా

అందుబాటులో ఉంది

ఇందిరమ్మ ఇళ్లకు రూ.266.94 కోట్లు మంజూరు

మహిళా సంఘాలకు

రూ.44.95 కోట్ల వడ్డీ రాయితీ

గణతంత్ర వేడుకల్లో కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

ఇందిరమ్మ ఇళ్లు

రాష్ట్రంలో ఇంటి స్థలం ఉండి, ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల ఆర్థికసాయాన్ని అందించే పథకాన్ని ప్రారంభించామని కలెక్టర్‌ పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా 19,397 ఇందిరమ్మ ఇండ్లు ఈ యేడాది లక్ష్యం కాగా, 16,919 ఇండ్లను ప్రభు త్వం మంజూరు చేసిందన్నారు. 216 ఇండ్లు పూర్తయ్యాయని, మిగతా ఇండ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయన్నారు. జిల్లాలో ఇండ్లకుగాను రూ.266.94 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.

విద్య

వైద్యం

సుభాష్‌నగర్‌: జిల్లాను అన్నిరంగాల్లో సమగ్రంగా అభివృద్ధిపథంలో తీసుకెళ్లేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని కలెక్టర్‌ తన ప్రసంగం ద్వారా వివరించారిలా..

గృహజ్యోతి పథకం ద్వారా జిల్లాలోని 2,89,727 కుటుంబాలకు ప్రతినెల జీరో బిల్లులు జారీ అవుతున్నాయి. ప్రభుత్వం రూ.219.96 కోట్ల సబ్సిడీని అందించింది.

నాయీబ్రాహ్మణ, రజక వృత్తుల్లో ఉన్న 3,023 మంది లబ్ధిదారులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నాం.

2025–26 యాసంగి సీజన్‌లో 5.33 లక్షల ఎకరాల సాగు అంచనాతో ప్రణాళికలను వ్యవసాయశాఖ సిద్ధం చేయగా.. ఇప్పటికే 4.10లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి.

రైతులకు అవసరమైన యూరియా, ఎరువులు అందుబాటులో ఉన్నాయి. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు 4,795 మెట్రిక్‌ టన్నుల యూరియాను బఫర్‌లో ఉంచాం.

ఈ ఏడాది వివిధ కారణాలతో చనిపోయిన 308 మంది రైతుల నామినీ ఖాతాల్లో రూ.15.40కోట్ల రైతుబీమాను జమ అయ్యింది.

మూడు వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ తోటల సాగు, బిందు సేద్యం కోసం లక్ష్యం నిర్ధేశించుకోగా, 1466 ఎకరాలకు పరిపాలన ఆమోదం లభించింది. 536 ఎకరాల్లో మొక్కలను నాటాం. 450 ఎకరాల్లో బిందు సేద్య పరికరాలను అమర్చాం.

967 చెరువుల్లో 3.85 కోట్ల చేపిల్లలను వదలగా, ఇందుకోసం రూ.3.89 కోట్లు వెచ్చించాం.

ధాన్యం సేకరణలో రాష్ట్రంలోనే జిల్లా మొదటిస్థానంలో నిలిచింది. రైతుల ఖాతాల్లో రూ.1656 కోట్లు జమ చేశాం.

అర్హులందరికీ ఆహారభద్రత కార్డులు జారీ చేస్తున్నాం.

మహాలక్ష్మి పథకం ద్వారా రూ.500కే గ్యాస్‌ సిలిండర్లను సరఫరా చేస్తున్నాం.

ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అమలవుతోంది. రెండేళ్లలో దాదాపు రూ.329 కోట్లు మహిళలకు ఆదా అయ్యాయి. సగటున ప్రతిరోజూ 1.02 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఎలక్ట్రికల్‌ ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లోనూ మహాలక్ష్మి వర్తిస్తోంది.

భూ పరిపాలనలో పారదర్శకత, భద్రత, ప్రజలకు సులభమైన సేవలు అందించే దిశగా ప్రభుత్వం భూభారతితో ముందడుగు వేసింది. రెవెన్యూ సదస్సుల్లో 40,462 దరఖాస్తులు అందగా, అందులో 17,762 పరిష్కరించాం. విచారణ అనంతరం 3,418 ఆమోదించగా, మిగతా 14,344 దరఖాస్తులు విచారణ దశలో ఉన్నాయి.

ప్రభుత్వ పాఠశాలలు, స్థానిక సంస్థల పాఠశాలల్లో మౌలిక వనరుల అభివృద్ధి కి అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం ద్వారా రూ.24.01 కోట్లు చెల్లించాం.

1,501 అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రస్తుతం 1,426 అంగన్‌వాడీ టీచ ర్లు, 933 ఆయాలు విధులు నిర్వహిస్తున్నారు. 76 అంగన్‌వాడీ టీచర్లు, 601 ఆయా పోస్టు లు ఖాళీ ఉన్నాయి.

ఆర్‌ అండ్‌ బీ, పంచాయతీరాజ్‌, ఇంజినీరింగ్‌, నీటిపారుదలశాఖల ద్వారా పను లు కొనసాగుతున్నాయి. ఆర్‌వోబీల నిర్మాణా నికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 10 చెక్‌డ్యాములకు రూ.32.32 కోట్లు ఖర్చు చేసింది. ఎత్తిపోతల పథకాల నిర్వహణ, ఐడీసీ పథకాలకు నిధులు మంజూరవుతున్నాయి.

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదారులకు రూ.57కోట్ల 58 లక్షలు పంపిణీ చేశాం.

జిల్లాలో 8 భారీ, మధ్య తరహా పరిశ్రమలు రూ.368.45 కోట్లతో స్థాపించగా, 7,324 మంది ఉపాధి పొందుతున్నారు.

900 సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలను రూ.516.60 కోట్ల పెట్టుబడితో స్థాపించగా, 6,983 మందికి ఉపాధి లభిస్తోంది.

శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్‌శాఖ, మహిళ ల రక్షణకు షీ టీములు స మర్థవంతంగా పని చేస్తున్నాయి.

గిరిజన, బీసీ అభివృద్ధిశాఖల, సాంఘిక సంక్షేమ, అల్ప సంఖ్యావర్గాల సంక్షేమశాఖల ద్వారా విద్యార్థులకు పోస్ట్‌ మెట్రిక్‌, ప్రీ మెట్రిక్‌ ఉపకార వేతనాలు అందిస్తున్నాం. బీసీ స్టడీ సర్కిల్‌ ద్వారా 100 మంది అభ్యర్థులకు గ్రూప్స్‌, ఎస్సెస్సీ, ఆర్‌ఆర్‌బీ, బ్యాంకింగ్‌ రంగాల్లో ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను 48శాతం నుంచి 70 శాతానికిపైగా పెంచేందుకు కృషి చేస్తున్నాం. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆయూష్మాన్‌ భారత్‌ పథకంతో కలిపి అమలు చేస్తున్నాం. రూ.10లక్షలకు వైద్య సహాయాన్ని ప్రభుత్వం పెంచింది. ఈ పథకం కింద 1,835 రకాల వ్యాధులకు గుర్తింపు పొందిన ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల ద్వారా చికిత్సలు, శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. గడిచిన ఏడాదిలో 24,791 మందికి శస్త్ర చికిత్సలు చేయగా ప్రభుత్వం రూ.66.12 కోట్లు చెల్లించింది.

2024–25సంవత్సరానికి 40,199 మహిళా సంఘాలకు రూ.44.95 కోట్ల వడ్డీ రాయితీని ప్రభుత్వం అందించింది. ఈ ఏడాదిలో 5,678 సంఘాలకు రూ.182 కోట్లు సీ్త్రనిధి రుణాలు మంజూరయ్యాయి. అలాగే 19,969 సంఘాలకు రూ.1228 కోట్ల లక్ష్యం నిర్దేశించుకో గా, ఇప్పటి వరకు 12,700 సంఘాలకు రూ.1,109 కోట్లు బ్యాంక్‌ లింకేజీ ద్వారా అందించాం. మెప్మా ఆధ్వర్యంలో 1699 సంఘాలకు రూ.200.90 కోట్ల రుణాలు లక్ష్యం. పట్టణ స్వయం ఉపాధి పథకం ద్వారా 58యూనిట్లకు రుణాలు మంజూరు చేశాం.

సమన్వయంతో ముందుకు1
1/9

సమన్వయంతో ముందుకు

సమన్వయంతో ముందుకు2
2/9

సమన్వయంతో ముందుకు

సమన్వయంతో ముందుకు3
3/9

సమన్వయంతో ముందుకు

సమన్వయంతో ముందుకు4
4/9

సమన్వయంతో ముందుకు

సమన్వయంతో ముందుకు5
5/9

సమన్వయంతో ముందుకు

సమన్వయంతో ముందుకు6
6/9

సమన్వయంతో ముందుకు

సమన్వయంతో ముందుకు7
7/9

సమన్వయంతో ముందుకు

సమన్వయంతో ముందుకు8
8/9

సమన్వయంతో ముందుకు

సమన్వయంతో ముందుకు9
9/9

సమన్వయంతో ముందుకు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement