వచ్చే నెల 6న సీఎం పర్యటన
● కేశాపూర్ శివారులో భారీ బహిరంగ
సభ నిర్వహణకు సన్నాహాలు
● ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి, నాయకులు
నిజామాబాద్ రూరల్: సీఎం రేవంత్‌రెడ్డి ఫిబ్రవరి 6వ తేదీన నిజామాబాద్ రూరల్ నియోజక వర్గానికి రానున్నారని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తెలిపారు. భారీ బహిరంగ సభ నిర్వహణ కోసం సోమవారం రూరల్ మండలం కేశపూర్ శివారులోని ప్రైవేట్ స్థలాన్ని పరిశీలించారు. తెలంగాణ కో ఆపరేటీవ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నగేశ్‌రెడ్డి, నగర అధ్యక్షుడు రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, యూత్ నాయకులు ఉమ్మాజీ నరేశ్, కేశాపూర్ సర్పంచ్ గంగారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు సాయిరెడ్డి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.


