ఏడు పదుల్లో ఎంచక్కా ఎవుసం
డొంకేశ్వర్(ఆర్మూర్): ‘‘ఒక్కసారి మట్టిలో కాలు పెడితే ఆ భూవిదేవి తల్లే లాగేసుకుంటది’’ ఇది ఓ సినిమాలో వ్యవసాయం గురించి ఓ రైతు చెప్పిన డైలాగ్. దీనికి డొంకేశ్వర్ మండల కేంద్రానికి చెంది న బార్ల నర్సారెడ్డి అక్షరాలా సరిపోతారని చెప్పొ చ్చు. చిన్నప్పుడే వంటబట్టిన వ్యవసాయాన్ని 70 ఏ ళ్లు వచ్చినా అలుపు లేకుండా చేస్తున్నాడు. తన జీవి తాన్ని వ్యవసాయానికే అంకితం చేసి అద్భుతమైన పంటలు పండిస్తున్నాడు. ఆధునిక పద్ధతులు, సాంకేతిక విధానాల ద్వారా వివిధ రకాల పంటలను సాగు చేసి అబ్బుర పరుస్తున్నాడు. పండ్ల తోటలను సైతం పెంచుతూ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా డు. నర్సారెడ్డికి డొంకేశ్వర్‌లో 40ఎకరాల వరకు వ్య వసాయ భూమి ఉంది. ముగ్గురు కొడుకులు ఆయా రంగాల్లో రాణిస్తూ ఆర్థికంగా స్థిరపడ్డారు. అయినా కూడా వ్యవసాయంపై మక్కువతో కూలీల సహాయంతో ఒక్కడే 40 ఎకరాల్లో వరి, మక్క, పసుపు, జొన్న పంటలను సాగు చేస్తున్నాడు. పండ్ల తోటల కోసం ప్రత్యేకంగా ఎకరం భూమిని కేటాయించి బొప్పాయి, జామ, నిమ్మ, మామిడి, అరటి, వాటర్ ఆ పిల్, సపోటా, రామ ఫలం లాంటివి పెంచాడు. ఎ రువులు, వ్యవసాయ పనిముట్లు పెట్టేందుకు ఫౌంహౌస్ కూడా నిర్మించాడు. రైతుల సమస్యల పై అవగాహన కలిగిన నర్సారెడ్డి కొన్నేళ్లుగా లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్‌గా కూడా పని చేస్తున్నారు.
వ్యవసాయ క్షేత్రంలో పనులు చేస్తున్న రైతు బార్ల నర్సారెడ్డి
చెరుకు, అరటి, బొప్పాయి చెట్లు
ఆదర్శంగా నిలుస్తున్న డొంకేశ్వర్
రైతు బార్ల నర్సారెడ్డి
40 ఎకరాల్లో వివిధ పంటలు సాగు,
పండ్ల తోటలు ప్రత్యేకం
ఆధునిక పద్ధతుల ద్వారా
పంటలకు సాగునీరు, ఎరువులు
ఏడు పదుల్లో ఎంచక్కా ఎవుసం


