త్రివర్ణ పతాకం రెపరెపలు | - | Sakshi
Sakshi News home page

త్రివర్ణ పతాకం రెపరెపలు

Jan 27 2026 7:39 AM | Updated on Jan 27 2026 7:39 AM

త్రివ

త్రివర్ణ పతాకం రెపరెపలు

నిజామాబాద్‌ లీగల్‌: గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని నిజామాబాద్‌ కోర్టులో జిల్లా జడ్జి జీవీఎన్‌ భారతలక్ష్మి జాతీయ జెండాను ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడాపోటీల విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మామిళ్ల సాయిరెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్‌రాజ్‌, న్యాయవాదులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ వర్సిటీలో...

తెయూ (డిచ్‌పల్లి): తెలంగాణ విశ్వవిద్యాలయంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్‌ యాదగిరితో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత, శిల్పి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చిరస్మరణీయులని కొనియాడారు. భారత రాజ్యాంగం కేవలం ఒక లిఖిత గ్రంథం కాదని, ఇది స్వేచ్ఛ స్వాతంత్యం, న్యాయ పరిరక్షణ కోసం పనిచేసే ఒక వ్యవస్థ అని పేర్కొన్నారు. వేడుకల్లో వర్సిటీ కళాశాల ప్రిన్సిపల్‌ రాంబాబు, వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సీహెచ్‌ లక్ష్మణ చక్రవర్తి, ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ఆరతి, ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ఘంటా చంద్రశేఖర్‌, పరీక్షల నియంత్ర ణ అధికారి సంపత్‌ కుమార్‌ పాల్గొన్నారు.

జెండా ఎగురవేసిన వైఎస్సార్‌ అభిమాని

నిజామాబాద్‌ రూరల్‌: నగరంలోని పెద్ద బజార్‌లో వైఎస్సార్‌ స్కూటర్‌ రిపేరింగ్‌ వర్క్‌షాప్‌ యజమాని, వైఎస్సార్‌ వీరాభిమాని నూరు భిక్షపతి గణ తంత్ర వేడుకలు నిర్వహించారు. జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సత్యనారాయణ, మహేశ్‌, శంకర్‌, సాగర్‌, రామచందర్‌, నర్సింలు పాల్గొన్నారు.

సాక్షి యూనిట్‌ కార్యాలయంలో...

డిచ్‌పల్లి: మండల కేంద్రంలోని సాక్షి యూనిట్‌ కార్యాలయంలో సోమవారం గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యూనిట్‌ మేనేజర్‌ మహేశ్‌ జెండాను ఎగురవేసి జాతీయ గీతం ఆలపించారు. కార్యక్రమంలో యూనిట్‌ సిబ్బంది పాల్గొన్నారు.

బెటాలియన్‌లో...

డిచ్‌పల్లి: మండలంలోని తెలంగాణ ప్రత్యేక పోలీస్‌ 7వ బెటాలియన్‌లో సోమవారం గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. కమాండెంట్‌ సత్యనారాయణ భరతమాత, మహాత్మా గాంధీ చిత్రపటాలకి పూలమాల వేసి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగమన్నారు. బెటాలియన్‌లో ఉత్తమ సేవలందించిన సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం పంపిన అతి ఉత్కృష్ట , ఉత్కృష్ట సేవా పతకాలను కమాండెంట్‌ అందజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమాండెంట్‌ కేపీ సత్యనారాయణ, నరసింహస్వామి, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, మినిస్ట్రియల్‌ స్టాఫ్‌, మెడికల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

త్రివర్ణ పతాకం రెపరెపలు1
1/4

త్రివర్ణ పతాకం రెపరెపలు

త్రివర్ణ పతాకం రెపరెపలు2
2/4

త్రివర్ణ పతాకం రెపరెపలు

త్రివర్ణ పతాకం రెపరెపలు3
3/4

త్రివర్ణ పతాకం రెపరెపలు

త్రివర్ణ పతాకం రెపరెపలు4
4/4

త్రివర్ణ పతాకం రెపరెపలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement