అంబరాన్నంటిన వేడుకలు
● ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
● జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్
సుభాష్‌నగర్: జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలో నిర్వహించిన గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. విస్డమ్, వసుధ, విజయ్ హైస్కూ ల్‌ల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మానవ తా సదన్ విద్యార్థులు ఒకే శృతిలో డప్పు వాయిస్తూ తమ కళా నైపుణ్యాన్ని చాటారు. కలెక్టర్, సీపీతోపాటు అతిథులు, ఉన్నతాధికారులు వారి వద్దకు వెళ్లి మెమెంటోలు, ప్రశంసాపత్రాలను బ హూకరించి ప్రత్యేకంగా అభినందించారు. ఆయాశాఖల శకటాలు ఆకట్టుకున్నాయి. వేడుకల్లో స్వా తంత్య్ర సమరయోధులు, అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్, అ దనపు డీసీపీ బస్వారెడ్డి, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
మానవతా
సదన్ విద్యార్థిని..


