అలరించిన నృత్య ప్రదర్శనలు
సుభాష్‌నగర్: రిపబ్లిక్ డే వేడుక సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతుల ను అలరింపజేశాయి. ఎదనిండా దేశభక్తి భావా న్ని నింపుకొని తమ ప్రదర్శనలతో గణతంత్ర దినోత్సవ వేడుకలకు వన్నెలద్దారు. విస్‌డమ్ హై స్కూల్ విద్యార్థులు తల్లీ భారతి వందనం గేయంపై, వసుధ హైస్కూల్ చిన్నారులు శంభాజీ మహరాజ్ శౌర్య పరాక్రమం గురించి, విజయ్ హై స్కూల్ బాలబాలికలు రోడ్డు భద్రతా నిబంధన లు పాటించాల్సిన ప్రాముఖ్యత గురించి చూడచక్కని నృత్య రీతులను అలవోకగా ప్రదర్శిస్తూ ఔరా అనిపించారు.
డిచ్‌పల్లి మానవతా సదన్ విద్యార్థులు ఒకే శృతిలో డప్పు వాయిస్తూ తమ కళా నైపుణ్యాన్ని చాటారు. ఈ సందర్భంగా కలెక్టర్, సీపీతోపాటు ఇతర అతిథులు, జిల్లా ఉన్నతాధికారులు చిన్నారుల వద్దకు వెళ్లి మెమోంటోలు, ప్రశంసాపత్రాలను బహూకరించి ప్రత్యేకంగా అభినందించారు. ఎస్‌హెచ్‌జీలకు సీ్త్రనిధి రుణాల చెక్కులు పంపిణీ చేశారు.
అలరించిన నృత్య ప్రదర్శనలు
అలరించిన నృత్య ప్రదర్శనలు


