కాంగ్రెస్‌లో వీఆర్‌దేశాయ్ చేరిక
బోధన్: బోధన్ పట్టణ కేంద్రానికి చెందిన బీఆర్‌ఎస్ నియోజకవర్గ ముఖ్య నాయకుడు, సీనియర్ న్యా యవాది, ఏంఎంసీ మాజీ చైర్మన్ వీఆర్ దేశాయ్ బీఆర్‌ఎస్‌కు గుడ్ బై చెప్పారు. సోమవారం నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ సలహాదారు, ఎమ్మె ల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి స్వగృహంలో వీఆర్‌దేశాయ్‌కి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించా రు. వీఆర్ దేశాయ్ మాజీ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ఆమేర్ ముఖ్య సన్నిహితుల్లో ఒకరిగా కొనసాగారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ను వది లి వీఆర్ దేశాయ్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అలాగే విలిన మున్సిపల్ గ్రామం ఆచన్‌పల్లికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు వేములపల్లి శ్రీరామ్మూర్తి, తన అనుచరులు, కార్యకర్తలతో కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ మండల అధ్యక్షుడు నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌లో వీఆర్‌దేశాయ్ చేరిక


