బీబీపేటలో ఒకరి అదృశ్యం
బీబీపేట: మండల కేంద్రా నికి చెందిన కొబ్బరిశెట్టి బా గాగౌడ్ ఆదివారం నుంచి కనిపించడం లేదని ఎస్సై విజయ్ తెలిపారు. బాగా గౌడ్ ఈ నెల 25న ఉద యం 8 గంటలకు స్థానిక ఎల్లమ్మ గుడి వద్ద కల్లు అమ్మడానికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఆచూకీ లభించకపోవడంతో భార్య కొబ్బరిశెట్టి అంజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
బైక్ చోరీ
నిజామాబాద్ అర్బన్: నగరంలోని రైల్వేస్టేషన్ ఎదుట బైక్ చోరీ జరిగినట్లు ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి ఆదివారం తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నామని పేర్కొన్నారు.
ఆక్సిజన్ పరికరాలు..
నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరాకు సంబంధించి పరికరాలు చోరీకి గురైనట్లు ఒక టో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. ఆనంద్ అనే వ్యక్తి ఆక్సిజన్ సరఫరాకు సంబంధించిన కాపర్‌వైరు, పరికరాలు దొంగలించినట్లు ఆస్పత్రి యజమాన్యం ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు.


