ప్రభుత్వ బడి పిలుస్తోంది
ప్రభుత్వ బడులను బతికించుకోవాలి
ప్రథమ పౌరులారా..
డిచ్‌పల్లి(నిజామాబాద్ రూరల్): మనం చదివిన క న్నతల్లి లాంటి ఊరి బడిని చూడగానే మనసు బా ల్యం వైపు పరిగెడుతుంది. మనకు విజ్ఞానంతోపా టు వివేకం నేర్పిన ప్రభుత్వ బడిలో చదివి, బాల్యం మధురస్మృతులను మరపురాని జ్ఞాపకాలను పదిలంగా దాచుకున్న ప్రథమ పౌరులు ఒక్కసారి ప్రభుత్వ బడిని సందర్శించండి. విద్యార్థులు, ఉపాధ్యాయులను పలకరించండి. పాఠశాల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయండి. వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థుల నమోదు పెంచేందుకు ప్రణాళికలు రచించండి. గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికలో పాఠశాల సమస్యలకు చోటు కల్పించి పరిష్కరించే ప్రయత్నం చేయండి.
ప్రభుత్వ బడిని ప్రథమ పౌరుడే బతికించాలి..
జిల్లాలోని అన్ని గ్రామాలలో నూతన పంచాయతీ పాలకవర్గాలు కొలువుదీరాయి. రెండేళ్లుగా పాలకవర్గాలు లేక సమస్యలతో సహవాసం చేస్తున్న పల్లెలలో అభివృద్ధి కార్యక్రమాలకు సర్పంచులు శ్రీకారం చుడుతున్నారు. ఊరుబడి బాగుంటే ఆ గ్రామం బాగుంటుంది. ఎన్నుకోబడిన చాలా మంది సర్పంచులు తన ఊరి బడిలో చదువుకున్నవారే. సర్పంచులు ఒక్కసారి తమ ప్రభుత్వ బడిని సందర్శించండి. అక్కడ నిరుపేద విద్యార్థులను పలుకరించండి. వారి కష్టసుఖాలను తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీరు సర్పంచు అనే దర్పాన్ని ఆ ఊరిలో జాతీయ పండుగల పర్వదినాలలో వేదికలపై ఆ ఊరిబడే చూపెడుతుంది. అక్కడి ఉపాధ్యాయులను గౌరవంతో పలుకరించి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. పాతబడిన భవనపు గోడలకు సున్నం వేయించండి. రాయలేకపోతున్న నల్లబల్లలకు రంగులు వేయండి. విద్యార్థులకు తగిన మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణానికి కృషి చేయండి. అవసరమయ్యే అదనపు గదులకు నిధులు మంజూరు చేయించి వీలైనంత త్వరగా శంకుస్థాపనలు చేసే ప్రయత్నం చేయాలి.
సన్మానించండి.. సమస్యలు చెప్పండి..
జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గ్రామ సర్పంచులు, వార్డు మెంబర్లను ప్రభుత్వ బడికి సాధారంగా ఆహ్వానించాలి. అందరికీ తోచిన విధంగా సన్మానించండి. ప్రస్తుత విద్యార్థుల అవసరాలకు తగినట్లుగా అత్యవసరంగా జరగాల్సిన పనుల జాబితా తయారుచేసి సర్పంచులకు విన్నవించండి. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వివరించండి. నాణ్యమైన విద్య నిరుపేద విద్యార్థులకు ఎలా అందుతుందో ప్రధానోపాధ్యాయులు వివరించే ప్రయత్నం చేయాలి. బడి బాగుకోసం ప్రథమ పౌరుడు ప్రణాళికలు రచించి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ)లో చేర్చేలా ప్రయత్నం చేయండి.
ఈ చిత్రంలో కనిపిస్తున్న రేకులపల్లి ప్రాథమిక పాఠశాలకు నూతనంగా ఎంపికై న 8వ వార్డు మెంబర్ గంగాధర్ తన తండ్రి ధర్పల్లి చిన్న గంగారం జ్ఞాపకార్థం రూ. 10 వేల విలువగల క్రీడాపరికరాలను వితరణ చేశారు. నూతనంగా ఎన్నికై న ప్రజాప్రతినిధులు ఇలాంటి చేయూతనందిస్తే ప్రభుత్వ పాఠశాలలకు కొంత మేలు జరుగుతుంది.
పసిప్రాయాలను ఎందరినో అక్కున చేర్చుకొని విజ్ఞానవంతులుగా చేసిన ప్రభుత్వ బడికి ఎంత చేసినా తక్కువే. జిల్లా లోని అన్ని గ్రామాల సర్పంచు లు తమ గ్రామంలోని సర్కారు బడిని సందర్శించి విద్యార్థుల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు పెరిగేలా వాటి ప్రాముఖ్యతను అందరికీ తెలిపే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వ బడులను అంతా కలిసి బతికించుకోవాలి.
– అంకం నరేశ్, పీఆర్‌టీయూ జిల్లా
అసోసియేట్ అధ్యక్షుడు
మన ఊరు బడిని బతికించుకుందాం
సమస్యల పరిష్కారానికి
సర్పంచులు నడుం బిగించాలి
ప్రభుత్వ పాఠశాల
అభివృద్ధికి ప్రణాళికలు వేయాలి
ప్రభుత్వ బడి పిలుస్తోంది


