టీసీఎస్ ఐయాన్‌పై అవగాహన
ఖలీల్‌వాడి: నగరంలోని గిరిరాజ్ కళాశాలలో అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో టీసీఎస్ ఐయాన్ జాబ్ అచీవర్ బిజినెస్ ఆపరేషన్ ప్రోగ్రాంపై ఆదివారం అవగాహన కల్పించారు. టీసీఎస్ ఐయాన్ ప్రతినిధి ప్రమోద్‌కుమార్ మాట్లాడుతూ ఓపెన్ యూనివర్సిటీలోని బీఏ, బీకాం, బీఎస్సీ మొదటి, రెండవ సెమిస్టర్ విద్యార్థులకు టీసీఎస్–ఐయాన్ ద్వారా ఆన్‌లైన్ కోర్సులు నిర్వహిస్తున్నామన్నారు. నైపుణ్యాల అభివృద్ధి, ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం, ఉపాఽధి అవకాశాలు పెంపొందించుకోవడానికి ఈ కోర్సు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఓపెన్ యూనివర్శిటీ కోఆర్డినేటర్ రంజిత, ఆర్‌సీసీ సిబ్బంది రాధ, చిందు, ప్రేమ్‌సింగ్, అధ్యాపకులు కౌన్సిలర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
రుద్రూర్: మండల కేంద్రంలోని గ్రంథాలయ శాఖను ఆదివారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ భవనంలోని సౌకర్యాలను పరిశీలించి, పాఠకులతో మాట్లాడారు. నిరుద్యోగులు, విద్యార్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి గ్రంథాలయ భవనం పైఅంతస్తులో ఉన్న గదిని రీడింగ్ రూంగా కేటాయించాలని సర్పంచ్ ఇందూర్ సునీత చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన చైర్మన్ అవసరమైన సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఉప సర్పంచ్ షేక్ నిసార్, మాజీ ఉప సర్పంచ్ డౌర్ సాయిలు, రైడ్ సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు కర్రోళ్ల కృష్ణ ప్రసాద్, పార్వతి శేఖర్ తదితరులు ఉన్నారు.
వర్ని: మండలంలోని మల్లారం శివారులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మూ డు వాహనాలు ధ్వంసమయ్యాయి. వర్ని నుంచి మైలారం వెళ్తున్న సరిచందు తన కారుతో మరో రెండు కార్లను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
టీసీఎస్ ఐయాన్‌పై అవగాహన
టీసీఎస్ ఐయాన్‌పై అవగాహన


