క్రైం కార్నర్
స్వదేశానికి చేరిన మృతదేహం
రామారెడ్డి (ఎల్లారెడ్డి): రామారెడ్డి మండలంలోని రెడ్డిపేట గ్రామానికి చెందిన గోపురాములు(34) రెండు నెలల క్రితం ఉపాధి నిమిత్తం దుబాయి దేశానికి వెళ్లాడు. వారం రోజుల క్రితం బాత్ రూంలో కిందపడి చనిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆదివారం స్వగ్రామానికి మృతదేహం చేరుకోగా అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. సర్పంచ్ నాగులపల్లి రాజేందర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు.
మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలోని లక్ష్మీనారయణ గోశాల సమీపంలో మిషన్ భగీరథ పైప్‌లైన్ కోసం తవ్విన గుంతలో గేదే దూడ పడి మృతి చెందినట్లు బాధితుడు అవార్‌వార్ హన్మాండ్లు తెలిపారు. నాలుగు రోజులుగా గేదేదూడ కనిపించకపోవడంతో ఆచూకీ కోసం వెతుకుతుండగా ఆదివారం గోశాల సమీపంలో తవ్వి వదిలేసిన గుంతలో దూడ కళేబరం కనిపించినట్లు తెలిపారు. గుంత మూసివేయకపోవడంతోనే దూడ మృతి చెందిందని, అధికారులు తనకు నష్టపరిహారం ఇప్పించాలని ఆయన కోరారు.
బైక్ చోరీ
రుద్రూర్: కోటగిరి మండలం దేవునిగుట్ట తండాకు చెందిన చలపతిరావు ద్విచక్రవాహనం చోరీకి గురైనట్లు ఎస్సై సునీల్ తెలిపారు. డిసెంబర్ 31న మధ్యాహ్నం కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామ శివారులోని పొలం వద్ద రోడ్డు పక్కన బైక్‌ను నిలిపి పొలానికి వెళ్లారు. తిరిగి వచ్చే సరికి బైక్ కనిపించలేదు. సమీప ప్రాంతాల్లో వెతికినా దొరకకపోవడంతో ఆదివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
నిజామాబాద్ రూరల్: రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూహౌసింగ్ బోర్డు కాలనీలో చోరీకి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 15న న్యూ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన రమేశ్ ఇంట్లో చొరబడిన దుండగులు బంగారు ఆభరణాలు, నగదు అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మే రకు కేసు నమోదు చేసుకొని, రెండు పోలీసు బృందాలు దర్యాప్తు చేపట్టా యి. శనివారం మధ్యాహ్నం వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ప్రియదర్శిని నగర్‌కు చెందిన బానోతు సందీప్‌ను పోలీసులు విచారించారు. దీంతో రమేశ్ ఇంట్లో చోరీకి పాల్పడినట్లు సందీప్ ఒప్పుకున్నాడని ఎస్‌హెచ్‌వో తెలిపారు. దొంగిలించిన బంగారాన్ని స్వాధీనం చేసుకొని నిందితుడిని రిమాండ్‌కు తరలించామన్నారు.
క్రైం కార్నర్


