వైభవోపేతంగా ఏకచక్రేశ్వర శివాలయ ఆవిర్భావ దినోత్సవం
బోధన్‌రూరల్: బోధన్ పట్టణంలోని ప్రసిద్ధ ఏక చక్రేశ్వర శివాలయంలో 67వ ఆవిర్భావ దినోత్స వాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఆదివా రం ఆలయ ప్రాంగణాన్ని పచ్చని తోరణాలు, పు ష్పాలతో అలంకరించారు. ఉదయం నుంచి స్వామి వారికి లఘున్యాస రుద్రాభిషేకం, బిల్వార్చన, నవగ్రహారాధనతోపాటు వివిధ రకాల పూలతో ప్రత్యేక అలంకరణ చేశారు. వేద పండితులు, ఆలయ ప్రధాన అర్చకులు గణేశ్ మహరాజ్, వేద ప్రముఖ్ సంతోష్ మహరాజ్, అర్చకులు మహేశ్ పాఠక్, శివ కుమార్ మంత్రోచ్ఛారణలతో స్వామి ఉత్సవ విగ్రహ మండపారాధన, రుద్ర హోమం, పూర్ణాహుతి, దూప దీప మంగళ నీరాజనాలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి నాయకం రాములు, పట్టణ ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వైభవోపేతంగా ఏకచక్రేశ్వర శివాలయ ఆవిర్భావ దినోత్సవం


