ప్రసూన్ కుమార్ రెడ్డి
రుద్రూర్: మండల కేంద్రానికి చెందిన ప్రసూన్‌కుమార్ రెడ్డి న్యూఢిల్లీలోని ఎన్‌సీఈఆర్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారు. విద్యా ప్రమాణాల పెంపుదలే లక్ష్యంగా ఎన్సీఈఆర్టీ దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ శిక్షణకు తెలంగాణ నుంచి ముగ్గురు ఉపాధ్యాయులు ఎంపికకాగా, అందులో ప్రసూన్‌కుమార్ రెడ్డి ఒకరు. ప్రస్తుతం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం నాగారం ప్రభుత్వ పాఠశాలలో సోషల్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. మొత్తం 21 రోజులపాటు సాగిన ఈ శిక్షణలో పాఠ్య పుస్తకాల రూపకల్పన, జాతీయ విద్యా విధానం–2020 (ఎన్‌ఈపీ–2020)కు అనుగుణంగా పాఠ్యసామగ్రి తయారీ, బోధనా పద్ధతుల నవీకరణ వంటి అంశాలపై విస్తృత అవగాహన పొందారు. ప్రసూన్‌కుమార్ రెడ్డి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సాంఘిక శాస్త్ర రిసోర్స్ పర్సనన్‌గా, పాఠ్యపుస్తక రచయితగా పలు సేవలు అందిస్తూ విద్యారంగంలో తనదైన ముద్ర వేస్తున్నారు. జాతీయ స్థాయి శిక్షణ పూర్తి చేయడంపై విద్యాశాఖ అధికారులు, సహచర ఉపాధ్యాయులు అభినందించారు.


