
తొలకరి రాకే ఆలస్యం..
● పనుల్లో నిమగ్నమవుతున్న రైతులు
● ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలో
92 వేల ఎకరాల్లో పంటల సాగు
నందిపేట్(ఆర్మూర్): రైతులు ఖరీఫ్ పనులకు సన్నద్ధమవుతున్నారు. తొలకరి రాకే ఆలస్యమంటున్న రైతులు సాగు ఏర్పాట్లలో బిజీబిజీగా ఉన్నా రు. గత వారం రోజులుగా దుక్కులు దున్నుతు న్నారు. విత్తనాలు, ఎరువులను సమకూర్చుకుంటున్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో ఆర్మూర్ నియోజకవర్గంలో సుమారు 92 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. విత్తనాలు, ఎరువుల అవసరాలపై వ్యవసాయాధికారులు నివేదికలను ఉన్నతాధికారులకు పంపించారు. సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు భూసారం పెంచేందుకు భూముల్లో ఎరువు, నల్లమట్టిని పోసుకుంటున్నారు. నియోజకవర్గ రైతులు ప్రధానంగా చెరువులు, కుంటలు, ఎత్తిపోతల ఆధారంగా పంటలు సాగు చేస్తారు. నందిపేట మండలంలో 11, ఆర్మూర్ మండలంలో 3 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. వీటి పరిధిలోనే సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంది. కాలం అనుకూలంగా ఉండి ఎస్సారెస్పీ పూర్తిగా నిండితే ఆశించిన స్థాయి పంటలు సాగవుతాయి. వర్షాలు సమృద్ధిగా కురిసి భూగర్భ జలాలుపైకి వస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటలు సాగవుతాయి.
భూమిని సిద్ధం చేశాం
ఖరీఫ్ పనులు ప్రారంభం కాకముందే ముందస్తుగా ఎరువులను తీసుకున్నాం. సోయా సాగు చేసేందుకు దుక్కి దున్ని భూమిని చదును చేసి ఉంచాం. విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేశాం.
– చిన్నారెడ్డి, రైతు, నందిపేట్
నివేదికలు పంపించాం
రబీ ముగియడంతో రైతులు రానున్న ఖరీఫ్ సీజన్‌కు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మేము క్షేత్ర స్థాయిలోకి వెళ్లి ఏ నేలలో ఏ పంటలు వేయాలో సలహాలు ఇస్తున్నాం. అవసరమైన విత్తనాలు, ఎరువులకు సంబంధించి నివేదికలు తయారు చేసి ఉన్నతాధికారులు పంపించాం. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం.
– విజయలక్ష్మి, ఏడీఏ
ఆర్మూర్ డివిజన్‌లో పంట సాగు వివరాలు (ఎకరాల్లో..)

తొలకరి రాకే ఆలస్యం..