అలా.. మాట్లాడిన అతను పదవికి రాజీనామా చేయాలి : ఎంపీ అర్వింద్‌ | - | Sakshi
Sakshi News home page

అలా.. మాట్లాడిన అతను పదవికి రాజీనామా చేయాలి : ఎంపీ అర్వింద్‌

Apr 4 2024 1:40 AM | Updated on Apr 4 2024 2:58 PM

- - Sakshi

మాట్లాడుతున్న ఎంపీ అర్వింద్‌

నిజామాబాద్‌: రాష్ట్రంలో ముసింల ఓట్ల కోసమే కాంగ్రెస్‌ పార్టీ పాకులాడుతోందని, అందుకు నిదర్శనమే మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలని బీజేపీ అభ్యర్థి, ఎంపీ అర్వింద్‌ ధర్మపురి పేర్కొన్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సీఏఏ, ఎన్‌ఆర్‌సీ అమలు చేయమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారికంగా ప్రకటించడాన్ని ఖండిస్తున్నామన్నారు.

మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, ముస్లింల ఓట్ల కోసం ఈ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. పార్లమెంట్‌లో పాసైన చట్టాలను ఏ రాష్ట్రమైనా అమలు చేయమనే అధికారం లేదన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే విధంగా మాట్లాడిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేశ్‌ కులాచారి, ప్రధానకార్యదర్శి లక్ష్మీనారాయణ, స్రవంతిరెడ్డి, న్యాలం రాజు, శంకర్‌, మల్లేశ్‌ యాదవ్‌, తదితరులు పాల్గొన్నారు.

ఇవి చదవండి: ముఖ్యమంత్రి గుంపు మేస్త్రీ.. ప్రధానమంత్రి తాపీ మేస్త్రీ..

Advertisement
 
Advertisement
Advertisement