
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: 'బోధన్ సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్ ఆమేర్‌పై పార్టీ కేడర్‌లో తీవ్ర అసమ్మతి నెలకొనగా, ఆయన తీరుపై స్థానిక ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ తూము పద్మ, ఆమె భర్త, కౌన్సిలర్ శతర్‌రెడ్డి సహా మరో ఐదుగురు కౌన్సిలర్లు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. గతంలో షకీల్ భార్య ఫాతిమా కారు ఢీకొని ఓ బాలుడు మృతి చెందిన ఘటనలో పోలీసులు గుర్తుతెలియని వాహనం ఢీకొట్టినట్లు కేసు నమోదు చేయడం.. మరో అంశంలో షకీల్ అనుచరులు ఓ ఉద్యోగిని బూతులు తిట్టిన ఘటనలో సదరు శాఖ ఉద్యోగులు పెన్‌డౌన్ చేయడం ప్రస్తుతం ఎన్నికల వేళ చర్చనీయాంశమయ్యాయి.'
పోలింగ్‌కు కౌంట్‌డౌన్ నడుస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ బీఆర్‌ఎస్‌కు బోధన్ నియోజకవర్గంలో ఎటు చూసినా ఎదురుగాలే వీస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్ విషయంలో తీవ్రమైన వ్యతిరేకత నెలకొని ఉంది. నివురుగప్పిన నిప్పు లా షకీల్‌పై కేడర్‌లో అసమ్మతి పే రుకుపోయింది. మరోవైపు ప్రజ ల్లో తీవ్ర అసహనం కనిపిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు బీఆర్‌ఎస్ నియోజకవర్గ స్థాయి నాయకులు, స్థానిక సంస్థల ప్ర జాప్రతినిధులు బీఆర్‌స్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇంకా పలువురు నాయకులు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ తీర్థం పుచ్చు కుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే బలంగా ఉన్న సుదర్శన్‌రెడ్డి మరింత దూకుడుగా ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారు. బోధన్ మున్సిపల్ చైర్‌పర్సన్ తూము పద్మ, ఆమె భర్త, కౌన్సిలర్ శతర్‌రెడ్డి సహా మరో ఐదుగురు కౌన్సిలర్లు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు.
ఎలాంటి ప్రొటోకాల్ లేని షకీల్ సతీమణి ఆయేషా ఫాతిమా పట్టణంలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంపై స్థా నిక ప్రజాప్రతినిధుల్లో తీవ్ర అసహనం నెలకొంది. ఫాతిమా కారు ఢీకొని ఒక బాలుడు మృతి చెందిన ఘటన సమయంలోనూ పోలీసులు గుర్తుతెలియని వాహనం ఢీకొట్టినట్లు కేసు నమోదు చేసిన విష యం చర్చనీయాంశమవుతోంది. మరో అంశంలో షకీల్ అనుచరులు ఓ ఉద్యోగిని బూతులు తిట్టిన ఘటనలో గతంలో సదరు శాఖ ఉద్యోగులు పెన్‌డౌ న్ చేశారు. ఇలాంటి అంశాలు ఉద్యోగుల్లో వ్యతిరేకతకు కారణమయ్యాయి.
► అనేక వివాదాల కారణంగా చివరకు మున్సిపల్ చైర్‌పర్సన్ పద్మ శరత్‌రెడ్డి దంపతులు కాంగ్రెస్ బాట పట్టారు. అదేవిధంగా నియోజకవర్గంలో పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సైతం బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ లో చేరారు.
బోధన్ పట్టణంలో ఛత్రపతి శి వాజీ మహరాజ్ విగ్రహం ఏర్పాటుపై నెలకొన్న వివాదం నేపథ్యంలో సైతం శరత్‌రెడ్డి పై కేసులు పెట్టడంతో గుర్రుగా ఉన్నారు. మరోవైపు మైనారిటీ కౌన్సిలర్లలో సైతం వ్యతిరేకత ఉంది. పట్టణంలో తనపై హ త్యాయత్నం చేశారంటూ కీలకమైన ఎంఐ ఎం కౌన్సిలర్ల కుమారులపై సైతం కేసులు నమోదు చేయించారంటూ గుర్రుగా ఉన్నారు. దీంతో ముస్లిం మైనారిటీల్లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
► కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి తన మాటల దాడి ని తీవ్రతరం చేస్తున్నారు. రూ. వందల కోట్ల ధా న్యాన్ని అక్రమ మార్గంలో తరలించారని, అక్రమ ఇసుక, మొరం దందా విచ్చలవిడిగా చేశారని, గత ఎన్నికల్లో మహారాష్ట్రకు చెందిన వాళ్లతో దొంగ ఓట్లు నమోదు చేయించి గెలిచినట్లు ఆరోపణలు చేస్తున్నా రు. వీటన్నింటిలో షకీల్ పాత్ర ఉందని సుదర్శన్‌రె డ్డి బలంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో షకీల్ కోసం ఎమ్మెల్సీ కవిత ఎంత ప్రచారం చేస్తున్నప్పటికీ ఫలితం రాదని బీఆర్‌ఎస్‌కు చెందిన కార్యకర్తలే పేర్కొనడం గమనార్హం.
ఇక బీఆర్‌ఎస్‌కు చెందిన డీసీసీబీ మాజీ చైర్మన్ గంగాధర్ పట్వారి, మాజీ సొసైటీ చైర్మన్ విజయ్‌కుమార్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంపల్లి ఎల్లయ్య కాంగ్రెస్ పార్టీలో చేరడం గమనార్హం. ఇదిలా ఉండ గా తెలంగాణ ఉద్యమకారుడు, పార్టీలో ఆది నుంచి కీలకంగా ఉన్న కందుర్గి గోపాల్‌రెడ్డి కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వెరసి ఎటు చూసినా షకీల్‌పై తీవ్ర వ్యతిరేకత గాలులు వీస్తున్నాయి.
ఇవి చదవండి: రెబెల్స్.. లేనట్లే ! కొత్తగూడెం ఏఐఎఫ్‌బీ అభ్యర్థిగా ‘జలగం’!