న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా | - | Sakshi
Sakshi News home page

న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా

Oct 24 2026 12:22 AM | Updated on Oct 24 2026 12:22 AM

నిర్మల్‌చైన్‌గేట్‌: ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, నెరవేర్చేలా కృషి చేస్తానని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్‌ సముద్రాల వేణుగోపాలచారి హామీ ఇచ్చారు. 11 రోజులుగా నిర్మల్‌లో నేషనల్‌ హెల్త్‌ మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె శిబిరాన్ని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా విధులను నిర్వహిస్తున్న వారికి, అదేస్థాయిలో వేతనాలు చెల్లించేలా కృషి చేస్తానన్నారు. ఉద్యోగుల హక్కుల సాధనకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement