ఓపెన్‌ నిర్లక్ష్యం.. జిమ్‌లు మాయం! | - | Sakshi
Sakshi News home page

ఓపెన్‌ నిర్లక్ష్యం.. జిమ్‌లు మాయం!

Oct 24 2026 12:22 AM | Updated on Oct 24 2026 12:22 AM

● నిర్మల్‌, భైంసా, ఖనాపూర్‌ పట్టణాల్లో చాలా వరకు పనిచేయని వైనం ● అధికారుల నిర్లక్ష్యంపై వాకర్లు, స్థానికుల ఆగ్రహం

ప్రజల వ్యాయామం కోసం మున్సిపాలిటీల్లో గత ప్రభుత్వం ఓపెన్‌ జిమ్‌లు ఏర్పాటు చేసింది. లక్షల రూపాయలు వెచ్చించి పరికరాలు కొనుగోలు చేసింది. దీంతో పట్టణవాసులు ఓపెన్‌ జిమ్‌లతో వ్యాయామంపై దృష్టి పెట్టారు. అయితే ఓపెన్‌ జిమ్‌ల నిర్వహణను గాలికి వదిలేయడంతో కొన్ని రోజులకే అక్కడి పరికరాలు చోరీ అయ్యాయి. కొన్ని చోట్ల విరిగిపోయాయి. ఆకతాయిలు కొన్నిచోట్ల విరగ్గొట్టారు. ఓపెన్‌ జిమ్‌ల పరిస్థితిపై ‘సాక్షి’ విజిట్‌ చేయగా చాలా చోట్ల విరిగిపోయి, పనిచేయని స్థితిలో పరికరాలు కనిపించాయి – నిర్మల్‌టౌన్‌

నిర్మల్‌లో ఇలా..

జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఓపెన్‌ జిమ్‌ పరికరాలు పూర్తిగా పాడైపోయాయి. పరికరాలు ప్రస్తుతం విరిగి, వంగి నిరుపయోగంగా మారాయి. ప్రతిరోజూ ఉదయం సుమారు 200 మంది వరకు ఈ గ్రౌండ్‌కు వచ్చి వాకింగ్‌ చేస్తుంటారు. చిన్నారులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఆటలాడుతుంటారు. ఇంతమంది ఉపయోగించే స్టేడియంలో ఓపెన్‌ జిమ్‌ పరికరాలు అధ్వాన్నంగా మారడం పట్ల వాకర్లు, స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో వచ్చే ప్రజలకు ఈ సదుపాయం అందుబాటులో లేకుండా పోయింది.

నిర్వహణ లోపం

కొన్ని పరికరాలు విరిగిపోగా, మరికొన్ని వంగిపోయి వినియోగించడానికి వీలులేని స్థితిలో ఉన్నాయి. ఏళ్లుగా సరైన మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రజాధనంతో ఏర్పాటు చేసినవి నిరుపయోగంగా మారుతున్నాయి. స్టేడియానికి వచ్చే చిన్నారులు, వాకర్లకు ఉపయోగపడాల్సిన సదుపాయాలు ఇలా పాడైపోయినా అధికారులు పట్టించుకోవడం లేదు.

భైంసాలో ఇలా..

భైంసాటౌన్‌: పట్టణ ప్రజలకు శారీరక వ్యాయామం ద్వారా ఆరోగ్యం చేరువ చేయాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం సీడీఎంఏ ఆధ్వర్యంలో మున్సిపాలిటీల్లో ఓపెన్‌ జిమ్‌లను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే అప్పట్లో భైంసా పట్టణంలోని కుంట ప్రాంతంలోనూ ఓపెన్‌ జిమ్‌ ఏర్పాటు చేశారు. అయితే, జిమ్‌ నిర్వహణపై అధికారులు పట్టించుకోకపోవడంతో, క్రమేపి నిరాదరణకు గురవుతూ వచ్చింది. జిమ్‌ చుట్టూ ప్రహరీ, పరికరాలకు రక్షణ లేకపోవడంతో దుండగులు జిమ్‌లోని పరికరాలను ఎత్తుకెళ్లారు. దీంతో కొదిరోజుల తరువాత ఓపెన్‌జిమ్‌ను పూర్తిగా తొలగించి, అదే ప్రదేశంలో షాదీఖానాను నిర్మించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement