న్యూస్‌రీల్
నిర్మల్
ఐక్యతతోనే హక్కులు సాధ్యం
ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కుమురం భీం కాంస్య విగ్రహాన్ని శుక్రవారం ఆవి ష్కరించారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి ఆదివాసీలు భారీగా తరలివచ్చారు.
అండర్–17 క్రికెట్
ఎంపిక పోటీలు
నిర్మల్‌టౌన్: ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని లక్కీ క్రికెట్ అకాడమీలో శుక్రవారం అండర్–17 బాలుర జిల్లాస్థాయి క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు నిర్వహించారు. సుమారు 150 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ప్రతిభ ఆధారంగా ఎంపికై న క్రీడాకారులు శనివారం నిర్వహించే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జోనల్‌స్థాయి పోటీలకు అర్హత సాధించనున్నారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ కార్యదర్శి రాథోడ్ లక్ష్మణ్, టీజీపీఈటీ కార్యదర్శి భూమన్న, టీఎస్‌పీఈటీ అధ్యక్షుడు అంబాజీ, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయుడు రమణ, లక్కీ క్రికెట్ అకాడమీ కోచ్ సుదర్శన్‌పాల్గొన్నారు.


