ఈసారి కన్నీళ్లతో దసరా.. | - | Sakshi
Sakshi News home page

ఈసారి కన్నీళ్లతో దసరా..

Oct 24 2026 12:10 AM | Updated on Oct 24 2026 12:10 AM

(ఫొటో23ఎన్‌ఆర్‌ఎల్‌02:

ముగ్గురు పిల్లలతో దుర్గం సత్తవ్వ)

‘పదివేలు పంపించిన. దసరా పండుగకు మీరందరూ మంచి బట్టలు తీసుకోండ్రి.. అని పోయిన ఏడాది దసరాకు పదివేలు పంపించాడు. ఇంటిల్లిపాది కొత్తబట్టలు కొనుక్కుని పండుగ చేసుకున్నం. ఆయన కూడా సంతోషపడ్డడు. మల్ల దసరా రాకముందే మాకు దూరమైండు. ఈసారి పిల్లలు మేము కన్నీళ్లతోనే పండుగ చేసుకున్నం. తనకెప్పుడూ పిల్లల గురించే ధ్యాస ఉండేది. వాళ్లను బాగా చదివించి ప్రయోజకులను చేయాలి, మనలాగా వాళ్ల జీవితాలు ఉండొద్దని చెప్పేవాడు. ఇప్పుడు పిల్లల చదువులకూ పైసలిచ్చేందుకు ఆయన లేడు. నా రెక్కల కష్టం మీదనే పిల్లలను చదివిస్తున్న. ఎక్కడి నుంచీ ఒక్క రూపాయి సాయం అందలేదు..’ అంటూ దుర్గం సత్తవ్వ కన్నీళ్లు పెట్టుకుంటోంది. కడెం మండలం పెత్తరుపు గ్రామానికి చెందిన దుర్గం లక్ష్మణ్‌ జూలై 4న దుబాయ్‌లో మృతిచెందాడు. ఉపాధి కోసం వెళ్లిన ఆయన అక్కడ ఎలా చనిపోయాడో కూడా సరైన కారణం కుటుంబసభ్యులకు తెలియని దుస్థితి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement