న్యూస్రీల్
మహా కలప.. లోకల్ బ్రాండ్
ఉమ్మడి జిల్లాలో కలప వ్యాపారం మాటున అక్రమాలు జరుగుతున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న కలపను లోకల్ బ్రాండ్ పేరుతో విక్రయిస్తున్నారు.
ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. వాతావరణం పొడిగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. వేడి ఎక్కువగా ఉంటుంది. రాత్రి చలి తగ్గుతుంది.
బాసరలో శరన్నవరాత్రోత్సవాలు
బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఆదివారం అమ్మవారు ‘మహా గౌరీ దేవి’గా భక్తులకు దర్శనమిచ్చారు.
మహిషాసుర దహనం
నిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలోని శ్రీగిరి నందిగుండం దుర్గామాత ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గాష్టమి పురస్కరించుకుని మహిషాసుర దహనం కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. అంతకుముందు ఎమ్మెల్యే దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దసరా పండుగ విశిష్టతను చాటిచెబుతూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి నిలుస్తుందని వివరించారు. దుర్గామాత మహిషాసురుడిని సంహరించిన ఘట్టం ధర్మానికి, సత్యానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు కొండాజీ వెంకటాచారి, ఆలయ అధ్యక్షుడు లక్కడి జగన్మోహన్ రెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, భవాని మాలధారణ భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
శాస్త్రీనగర్ అభయాంజనేయ స్వామి ఆలయంలో
బతుకమ్మ సంబరాల్లో మహిళలు
వాయినం ఇచ్చిపుచ్చుకుంటున్న మహిళలు
జిల్లా కేంద్రంలోని కొన్ని కాలనీల్లో ఆదివారం సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చారు. అనంతరం తమ కాలనీల్లో బతుకమ్మపాటలతో కోలాటం వేస్తూ సాగనంపారు. శాసీ్త్రనగర్, ప్రియదర్శిని నగర్, దివ్యనగర్ కాలనీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. బంగాల్పేట వినాయకసాగర్ చెరువు వద్దకు బతుకమ్మలతో చేరుకుని ఒకరికొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటూ నిమజ్జనం చేశారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్
సద్దుల సంబురం


