అతివలు.. ఆర్థికాభివృద్ధి సాధకులు | - | Sakshi
Sakshi News home page

అతివలు.. ఆర్థికాభివృద్ధి సాధకులు

Oct 19 2026 2:13 AM | Updated on Oct 19 2026 2:13 AM

స్వయం సహాయక సంఘాలకు సులభంగా రుణాలు సద్వినియోగం చేసుకుంటున్న జిల్లా మహిళలు తిరిగి చెల్లింపులోనూ ఆదర్శం.

జిల్లాలో 10,824 సంఘాలకు

రూ.236.122 కోట్ల రుణాలు

గత ఆర్థిక సంవత్సరానికి రూ.503.34 కోట్ల టార్గెట్‌

ఇందులో 24,530 మహిళా సంఘాలకు రూ.234.12 కోట్ల రుణాలు

టార్గెట్‌ రూ.124.30 కోట్ల

ఇప్పటి వరకు సభ్యులకు ఇచ్చిన రుణాలు రూ.32.42 కోట్లు

కుటుంబానికి అండగా..

నా భర్త సాయినాథ్‌ కుల వృత్తితో మట్టి కుండలు ఇరత వస్తువులు తయారు చేసేవాడు. పిల్లలు పెరిగి పెద్దయ్యాక ఖర్చులు ఎక్కువయైయ్యాయి. వచ్చిన డబ్బులు సరిపోక బ్యాంకు లింకేజీ నుంచి రూ.1.50 లక్షలు, సీ్త్రనిధి నుంచి రూ.50 వేలు రుణం తీసుకున్నా. ఏడాది కిందట మట్టి దీపాలు తయారు చేసే మిషన్‌ను కొనుగోలు చేశాను. దీపాలు అమ్మిన డబ్బుతో దినదినాభివృద్ధి చెందుతున్న వ్యాపారంలో ఇప్పుడు భర్త సాయినాథ్‌, కుమారుడు నాగరాజ్‌కుతోడుగా ఉండి కుటుంబాన్ని పోషించుకుంటు సంతోషంగా జీవిస్తున్నాం.

– కోరండ్ల చంద్రబాయి, కోలూర్‌, తానూర్‌

వ్యాపార విస్తరణ..

నేను గ్రామంలోని స్వయంసహాయ సంఘంలో రూ.2 లక్షలు రుణం తీసుకుని చీరలు, డ్రెస్‌ మెటీరియల్‌, మహిళలకు సందించిన వస్తువులకు దుకాణం ప్రారంభించా. ఒకవైపు దుకాణం నడిస్తూనే మరోవైపు దుస్తువులు కుడుతూ భర్త సంపాదనలో పోటీపడ్డాను. ఇప్పుడు దుకాణంలో దాదాపు అన్ని రకాల వస్తువులు లభించేలా (జనరల్‌ స్టోర్‌ దుస్తువులు ఇలా) పెద్ద దుకాణం ఏర్పాటు చేసుకున్నాం. – శమా బేగాం, రాజూర

లోకేశ్వరం: నేటి మహిళలు ఇంట్లో ఖాళీగా ఉండకుండా కుటుంబ పోషణకు తోడ్పడుతున్నారు. తమకు ఆసక్తి ఉన్న రంగాల్లోకి ప్రవేశించి రుణాలు పొంది ముందుకు సాగుతున్నారు. అంతటితో ఆగకుండా వ్యాపారాలు ప్రారంభించి నిర్వహిస్తున్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యురాళ్లుగా తమ ఆశయాల వైపు నడుస్తూ ప్రభుత్వం అందించే రుణాలను సద్వినియోగం చేసుకుంటూ పేదరికం నుంచి బయటపడి ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు. బ్యాంకు రుణాల సద్వినియోగంపై అధికారులు చైతన్యం కల్పించడంతో నెలవారీ వాయిదాలు సక్రమంగా చెల్లిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. దీంతో బ్యాంకులు ఎలాంటి పూచీకత్తులు లేకుండానే రుణాలు మంజూరు చేయడానికి ముందుకు వస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మహిళా సంఘాలకు రుణాలు వేగంగా అందుతున్నాయి. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం బ్యాంకుల ద్వారా వివిధ రుణాలను అందజేస్తోంది.

జిల్లాలో విస్తృత నెట్‌వర్క్‌

జిల్లాలో 18 మండలాల్లో 504 గ్రామైక్య సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో 12,236 మహిళా స్వయం సహాయక సంఘాలు పనిచేస్తున్నాయి. అర్హతగల వారందరినీ సంఘాల్లో చేర్చడంతో కొత్త సంఘాలు ఏర్పడ్డాయి. ప్రతీ సంవత్సరం ప్రభుత్వం బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు అందిస్తోంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే లక్ష్యాలు నిర్దేశించి వాటిని సాధించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సంఘాల మహిళలు వ్యాపార నిర్వహణ, విస్తరణ, ఉపాధి కోసం రుణాలు పొంది ఆర్థిక స్వావలంబన వైపు ముందుకు సాగుతున్నారు.

రూ.236.12 కోట్ల రుణాల పంపిణీ

2026–27 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో వివిధ బ్యాంకుల లింకేజీ ద్వారా 10,824 సంఘాలకు రూ.236.12 కోట్లు అందించారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.503 కోట్ల లక్ష్యంతో 24,530 మహిళా సంఘాలకు రూ.234.12 కోట్లు మంజూరు చేశారు. మహిళలు ఈ రుణాలను వ్యాపార నిర్వహణకు వినియోగించి నెలనెలా వాయిదాలు సక్రమంగా చెల్లిస్తుండటంతో బ్యాంకులు పోటీపడి రుణాలు ఇస్తున్నాయి. ఇటీవల జరిగిన బ్యాంకర్ల సమావేశంలో బ్యాంకు లింకేజీని సకాలంలో అందించాలని సూచించారు. లోకేశ్వరం మండలంలో 273 స్వయం సహాయక సంఘాలకు చెందిన 2,200 సభ్యులు రూ.19.40 కోట్లు పొంది వివిధ ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. సెర్ఫ్‌ సిబ్బంది రుణాలు సకాలంలో అందేలా బ్యాంకు సిబ్బందితో సమన్వయం చేస్తున్నారు. నెలాఖరులోగా లక్ష్యం పూర్తయ్యే అవకాశం ఉంది.

వ్యాపారాలతో ఆర్థిక పురోగతి

బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు పొందిన సంఘా ల మహిళలు వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. కుట్టు పని, అల్లిక, పచ్చళ్లు, పిండి మర, ఇస్తారాకులు, పేపర్‌ గ్లాసులు, ప్లేట్ల తయారీ వంటి పనులు చేపట్టారు. వ్యవసాయ పెట్టుబడులు, పాడి పశువులు, ఆటో కొనుగోలు, కిరాణా, గాజులు, స్టేషనరీ దుకాణాలు నడుపుతూ ఆర్థికంగా ఎదుగుతున్నారు.

ఆదాయ వృద్ధిపై ప్రత్యేక దృష్టి

బకాయిలు ఉన్న మహిళలపై ఒత్తిడి చేయకుండా అధికారులు వారి పరిస్థితిని అర్థం చేసుకుని ఆదాయ మార్గాలను మెరుగుపరిచారు. ఉపాధిహామీ పథకం ద్వారా పనులు కల్పించి ఆదాయం అందేలా చూశారు. దీనితో వారు బ్యాంకు రుణాలు తిరిగి చెల్లించడం ప్రారంభించారు.

2026–27 బ్యాంకు లింకేజీ

రుణాల వివరాలు..

సీ్త్రనిధి రుణాలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement