భైంసాటౌన్: నీరే మనిషికి జీవనాధారం. నీరు లేనిదే మానవ మనుగడ లేదు. పంటలు పండకపోతే తినడానికి తిండి దొరకదు. అందుకే ప్రభుత్వాలు నీటి వనరులకు అత్యంత ప్రాధాన్యతనిస్తాయి. ప్రస్తుత ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ నీటి ప్రాధాన్యత తెరపైకి వచ్చింది. ఎల్నినో కారణంగా వర్షాలు పడక నీటికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడవచ్చని, ప్రతి ఒక్కరూ నీటిని వృథా చేయకుండా సంరక్షణ చర్యలు తీసుకోవాలని సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారం చేస్తున్నారు. కానీ, అందరూ తమవంతు బాధ్యతగా పాటిస్తేనే ఎల్నినోను ఎదుర్కోగలమని, ప్రతి ఒక్కరూ నీటిని సంరక్షించాల్సిన అవసరముందని ప్రభుత్వం, వాతావరణ శాఖ నిపుణులు సూచిస్తున్నారు.
8 నెలలు గడ్డు పరిస్థితులు..
సాధారణంగా చలికాలంలో ఉదయం 9 గంటల వరకు చలిగానే ఉంటుంది. కానీ, ప్రస్తుత ఎల్నినో పరిస్థితుల్లో ఉదయం 7 గంటల నుంచే ఎండలు మండుతున్నాయి. వేసవిని తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణంలో మార్పులు, పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో రాబో యే రోజుల్లో నీటి ఎద్దడి తీవ్రరూపందాల్చే ప్రమా దం ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరి స్తున్నారు. రాబోయే ఎనిమిది నెలలు మనందరికీ సవాలు అని చెబుతున్నారు. అక్టోబర్ నుంచి వచ్చే జూన్ వరకు తీవ్రమైన పరిస్థితులు ఉంటాయని చెబుతున్నారు. తీవ్రమైన ఎండలు, వర్షాభావ పరి స్థితులు, జలాశయాలు, చెరువులు, కుంటల్లో నీటి నిల్వల తడగ్గుదల, భూగర్భ జలాలు అడుగంటిపోతాయని హెచ్చరిస్తున్నారు.


